Kyle Jamieson : ఇప్పుడు చూసితివా జేమీసన్.. బుడ్డోడిపైనా నీ ప్రతాపం .. చర్యలు తీసుకున్న బీసీసీఐ
శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ (Kyle Jamieson) కాస్త అతి చేశాడు.
IPL 2026 RR vs DC Kyle Jamieson handed demerit point for aggressive send (pic credit@ipl)
- వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తరువాత దూకుడుగా జేమీసన్ సంబురాలు
- చర్యలు తీసుకున్న బీసీసీఐ
Kyle Jamieson : శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ కాస్త అతి చేశాడు. రాజస్థాన్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని క్లీన్ బౌల్డ్ చేసిన అనంతరం జేమీసన్ కాస్త అతిగా సంబరాలు చేసుకున్నాడు. వైభవ్‌కు చాలా దగ్గరగా వెళ్లి అరుస్తూ చప్పట్లు కొడుతూ సెకాండఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కైల్ జేమీసన్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 15 ఏళ్ల బాలుడిని ఔట్ చేసి ఇలా ఎవరైనా చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రెండు బంతులే మాత్రమే ఆడాడు. ఆ రెండు కూడా కైల్ జేమీసన్ బౌలింగ్‌లోనే ఆడాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన వైభవ్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
MS Dhoni : సీఎస్కే పై ధోని అసంతృప్తి? జడేజానే కారణమా? ఐపీఎల్లో ధోని అందుకే ఆడడం లేదా?
బీసీసీఐ శిక్ష..
మ్యాచ్‌లో కైల్ జేమీసన్ కాస్త అతిగా సంబరాలు చేసుకోవడంపై బీసీసీఐ కూడా దృష్టి సారించింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ ను ఉద్దేశించి అనుచితంగా ప్రవర్తించడంతో కైల్ జేమీసన్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. అంతేకాదండోయ్ అతడికి సీరియస్‌గా ఓ వార్నింగ్‌ను కూడా ఇచ్చింది.
𝙏𝙝𝙚 𝙍𝙤𝙖𝙧 𝙊𝙛 𝘼 𝙏𝙞𝙜𝙚𝙧 🔥🐅pic.twitter.com/eRjKOlhzFR
— Delhi Capitals (@DelhiCapitals) May 1, 2026
‘జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైల్ జేమీసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. ఆర్టికల్ 2.5 నిబంధన ప్రకారం ప్రత్యర్థి ప్లేయర్‌ను ఉద్దేశించి అసభ్యకరమైన భాష, అనుచిత సైగలు చేయడం నిషేదం. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తరువాత జేమీసన్ బ్యాటర్లకు దగ్గర వెళ్లి కాస్త దూకుడుగా సంబరాలు చేసుకోవడం సరికాదు. అ క్రమంలో రిఫరీ ఆదేశాల మేరకు జేమీసన్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చాం. మరోసారి ఇలాంటి చేయకుండా అతడిని హెచ్చరించాం. ఇక చేసిన తప్పును వేసిన శిక్షను జేమీసన్ అంగీకరించాడు.’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
