Josh Hazlewood : ఆర్‌సీబీ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ సీజ‌న్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడ‌డో తెలుసా?

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేద‌ని తెలుస్తోంది.

IPL 2026 do you know How Many Matches Will RCB pacer Josh Hazlewood Miss report

  • మార్చి 28 ఐపీఎల్ 2026 ఆరంభం
  • ఇంకా కోలుకోని ఆర్‌సీబీ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్‌

Josh Hazlewood : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అత‌డు ఐపీఎల్ 2026లో ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడ‌ని స‌మాచారం.

ఐపీఎల్ 2025 విజేత‌గా ఆర్‌సీబీ నిల‌వ‌డంలో జోష్ హేజిల్‌వుడ్ కీల‌క పాత్ర పోషించాడు. అత‌డు 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు ప‌డ‌గొట్టి ఆర్‌సీబీకి క‌ప్పును అందించాడు. దీంతో ఐపీఎల్ 2026లోనూ అత‌డు కీల‌కంగా మార‌తాడ‌ని ఆర్‌సీబీ భావిస్తోంది.

Sanju Samson : సంజూ శాంస‌న్ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల‌రా? రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ హాట్ కామెంట్స్‌

అయితే.. ఆర్‌సీబీ ఈ సీజ‌న్‌లో ఆడే తొలి రెండు మ్యాచ్‌ల‌కు హేజిల్‌వుడ్ దూరం కానున్నాడ‌ని క్రిక్‌బ‌జ్ తెలిపింది. ఈ సీజ‌న్ ఆరంభ పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు ఏప్రిల్ 5న చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ త‌ల‌ప‌డే మ్యాచ్‌కు హేజిల్‌వుడ్ దూరం కానున్నాడ‌ని పేర్కొంది.

కొద్ది నెల‌ల క్రితం జోష్ హేజిల్‌వుడ్ గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌తో పాటు భార‌త్, శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి దూరం అయ్యాడు. ఇంకా అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేద‌ని స‌మాచారం.

Ishan Kishan : టీ20ల్లో ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ రికార్డు ఇదే.. ఓరీ నాయ‌నో..

ప్ర‌స్తుతం అత‌డు ఫిజియో ఆధ్వ‌ర్యంలో ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఫిజియో క్లీన్ చిట్ ఇస్తేనే అత‌డు ఐపీఎల్ ఆడ‌నున్నాడు. ఒక‌వేళ హేజిల్‌వుడ్ సేవ‌లు కోల్పోతే ఆర్‌సీబీకి అది పెద్ద ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు.