RCB vs GT : ఐపీఎల్ ఫైన‌ల్‌.. ఇరు జ‌ట్ల‌లోని ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు (RCB vs GT) క‌ప్పు కోసం పోటీప‌డనున్నాయి.

IPL 2026 Final GT vs RCB match few player eye on these milestones

  • అహ్మ‌దాబాద్‌లో ఐపీఎల్ 2026 ఫైన‌ల్ నేడు
  • క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్న ఆర్‌సీబీ, గుజ‌రాత్
  • ఇరు జ‌ట్ల‌లోని ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ఊరిస్తున్న ప‌లు రికార్డులు

RCB vs GT : ఐపీఎల్ 2026 సీజ‌న్‌ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నేడు (ఆదివారం మే 31) అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జ‌ట్టు గెలిచినా కూడా.. ఆ జ‌ట్టుకు ఇది రెండో ఐపీఎల్ ట్రోఫీనే అవుతుంది.

క్వాలిఫ‌య‌ర్‌-1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న ఆర్‌సీబీ అదే ఊపులో ఫైన‌ల్‌లోనూ మ‌రోసారి ఆ జ‌ట్టును ఓడించి వ‌రుస‌గా రెండో సారి ట్రోఫీని ముద్దాడాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు క్వాలిఫ‌య‌ర్‌-1లో ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని గుజ‌రాట్ టైటాన్స్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.

Sachin Tendulkar : ఐపీఎల్‌లో భారీ మార్పులు చేయాలి.. ఈ నిబంధ‌న‌ను ర‌ద్దు చేయాల‌ని.. స‌చిన్ టెండూల్క‌ర్ సూచ‌న‌

ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు మూడుసార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ‌గా.. రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌లో గుజ‌రాత్ గెలుపొందింది.

ఇదిలా ఉంటే.. ఫైన‌ల్ మ్యాచ్‌లో రెండు జ‌ట్ల‌లోని ప‌లువురు ఆట‌గాళ్లు మైలురాళ్ల‌ను చేరుకునే అవ‌కాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

* దేవదత్ పడిక్కల్ – టీ20ల్లో 150 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకోవ‌డానికి ఇంకో 5 సిక్స‌ర్లు కావాలి
* రజత్ పాటిదార్ – టీ20ల్లో 250 ఫోర్ల మైలురాయిని చేరుకోవ‌డానికి ఇంకో 5 ఫోర్లు కావాలి
* కృనాల్ పాండ్యా – ఐపీఎల్‌లో 2000 ప‌రుగుల మైలురాయిని చేరుకునేందుకు ఇంకో 19 రన్స్ అవ‌స‌రం
* టిమ్ డేవిడ్ – మ‌రో 4 ఫోర్లు కొడితే ఐపీఎల్‌లో 450 ఫోర్ల క్ల‌బ్‌లో చేర‌తాడు
* జితేష్ శర్మ – మ‌రో 3 ఫోర్లు కొడితే టీ20ల్లో 300 ఫోర్ల క్ల‌బ్‌లో చేర‌తాడు.
* రొమారియో షెపర్డ్ – ఇంకో 5 సిక్స‌ర్లు బాదితే టీ20లో 200 సిక్స‌ర్ల క్ల‌బ్‌లోకి అడుగు

Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభ‌వ్ బ్యాటా మ‌జాకానా.. 12 కోట్లు..

గుజ‌రాత్ టైటాన్స్‌..

* సాయి సుదర్శన్ – టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి 10 సిక్సర్లు కావాలి
* శుభ్‌మన్ గిల్ – ఐపీఎల్‌లో 450 ఫోర్ల క్ల‌బ్‌లో చేరేందుకు 6 ఫోర్లు అవ‌స‌రం
* కగిసో రబాడ – మ‌రో మూడు వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో 150 వికెట్ల క్ల‌బ్‌లోకి అడుగు
* శుభ్‌మన్ గిల్ – ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచేందుకు 53 పరుగులు అవసరం.