MI vs SRH : నేడు స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియ‌న్స్ ఇండియ‌న్స్‌కు చావో రేవో..

నేడు (ఏప్రిల్ 29) స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో కీల‌క పోరుకు సిద్ధ‌మ‌వుతోంది ముంబై ఇండియ‌న్స్‌ (MI vs SRH). వాంఖ‌డే మైదానం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

IPL 2026 Mumbai Indians must win match against Sunrisers Hyderabad to chance playoffs

  • స‌న్‌రైజ‌ర్స్‌తో కీల‌క మ్యాచ్‌
  • ముంబైకి చావో రేవో
  • ఓడితే ప్లేఆఫ్స్ సంక్లిష్టం

MI vs SRH : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌ ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచ్ లు ఆడింది. కేవ‌లం రెండు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఆ జ‌ట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేటు -0.736గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ క్ర‌మంలో నేడు (ఏప్రిల్ 29) స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో కీల‌క పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. వాంఖ‌డే మైదానం ఈ మ్యాచ్‌కు (MI vs SRH) ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

Riyan Parag : ఈ సీజ‌న్‌లో తొలిసారి ఓడిపోయిన పంజాబ్‌.. రాజ‌స్థాన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఈ మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్‌కు చావోరేవో మ్యాచ్ లాంటిది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉంటాయి. అదే స‌మ‌యంలో ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అవుతాయి.

గ‌త సీజ‌న్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే 8 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి జ‌ట్లు టాప్‌-4లో చోటు ద‌క్కించుకుని ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతున్నాయి. అదే 9 మ్యాచ్‌ల్లో గెలిచిన జ‌ట్లు మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు వెళ్లాయి. ఈ లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్‌లే గెలిచిన ముంబై మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించాల్సి ఉంటుంది. క‌నీసం 6 మ్యాచ్‌ల్లోనైనా గెలుపొందాల్సిందే. ఈ నేప‌థ్యంలో స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్ ముంబైకి కీల‌కంగా మారింది.

PBKS vs RR : అర్ష్‌దీప్ సింగ్ ఎంత ప‌ని చేశావ‌య్యా.. పాపం బుడ్డోడు.. చారిత్రాత్మ‌క ‘సెంచ‌రీ’ రికార్డు జ‌స్ట్ మిస్‌..

హెడ్-టు-హెడ్..
ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్, ముంబై జ‌ట్లు 34 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 19 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 15 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియ‌న్స్ గెలుపొందింది.