Riyan Parag : జైలుకి రియాన్ పరాగ్? ఖేల్ ఖతం.. మ్యాచ్‌లు ఫసక్!
డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ (Riyan Parag) ఇ-సిగరేట్ తాగుతూ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- April 29, 2026 / 02:58 PM IST
IPL 2026 Riyan Parag Vaping Row Report Charts Out Possible Punishment
Riyan Parag : న్యూ చండీగడ్ వేదికగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్‌లు పక్కన ఉండగానే డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్ (ఇ-సిగరేట్) చేశాడు. అతడు ఇ-సిగరేట్ తాగుతున్న చిత్రాలు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్టేడియంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానికి అనుమతి లేదు. నిర్దిష్టమైన ప్రదేశాల్లో మాత్రమే పొగ తాగేందుకు అనుమతి ఉంది. అదే సమయంలో నికోటిన్ పరిమాణంతో సంబంధం లేకుండా, ఇ-సిగరెట్ల తయారీ, దిగుమతి, అమ్మకం, వాడకం, నిల్వను నిషేధించే 2019 చట్టం ప్రకారం భారతదేశంలో ఇవి నిషేధించబడ్డాయి. ఉల్లంఘనలకు రూ.5 లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ఇ-సిగరేట్ తాగాడని తేలితే అతడికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే.. అంతకన్నా ముందే ఈ ఘటన పై బీసీసీఐ విచారణ చేపట్టి పరాగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అతడిని మిగిలిన సీజన్ నుంచి బహిష్కరించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా పర్వాలేదనిపిస్తుండగా బ్యాటర్ గా విఫలం అవుతున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లలో 14.62 సగటుతో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు.
