IPL 2026 RR vs DC : ఆ తప్పు మా కొంపముంచింది.. మా అసలు వ్యూహం ఇదే.. ఓటమిపై రియాన్ పరాగ్ కీలక కామెంట్స్..

IPL 2026 RR vs DC : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. జట్టు ఓటమికి గల కారణాలను వివరించాడు. మా వ్యూహాలు విఫలమయ్యాయని చెప్పుకొచ్చాడు.

Riyan Parag

  • రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
  • ఓటమిపై కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక కామెంట్స్
  • ఆ తప్పు మా కొంపముంచిందని వ్యాఖ్య

IPL 2026 RR vs DC : ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్  విజయం సాధించింది.

Also Read : Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ బలహీనత ఏమిటి? వెస్టిండీస్ దిగ్గ‌జం ఇయాన్ బిషప్ ఏమ‌న్నాడంటే ?

రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.

రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలను వివరించాడు. ఈ పిచ్‌పై 200 పరుగులు సరిపోతుందని, ఇన్నింగ్స్ గడిచేకొద్దీ పిచ్ నెమ్మదిస్తుందని అంచనా వేశాం. అయితే, మిడిల్ ఓవర్లలో తమ బౌలర్లు మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉందని, ప్రత్యర్థి బ్యాటర్లు సులభంగా పరుగులు రాబట్టకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యామని పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఓకే ఓవర్లో వరుసగా బౌండరీలు సమర్పించుకోవడం, ఆ తప్పు పదేపదే పునరావృతం కావడం తమ కొంపముంచింది. మా తప్పుల వల్ల ఢిల్లీ బ్యాటర్లకు ఫామ్ దొరికిందని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తాము ప్లాన్ మార్చుకోవడంలో విఫలమయ్యాం. అయితే, ఈ మ్యాచ్ లో మేము ఓడిపోయినప్పటికీ.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయడం అనే నిర్ణయం సరైనదేనని రియాన్ పరాగ్ సమర్ధించుకున్నాడు.

విధ్వంసకర బ్యాటర్ డోనోవన్ ఫెరీరాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపకపోవడంపై మాట్లాడుతూ.. వాస్తవానికి.. ఇన్నింగ్స్ మరో 8 -9 ఓవర్లు ఉన్నప్పుడు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఓవర్లకు 8 లేదా తొమ్మిది పరుగులు తీసి, ఆ తరువాత వచ్చే పేసర్లను ఫెరీరా వంటి పవర్ హిట్టర్లు నేరుగా ఎదుర్కోవాలనేది తమ వ్యూహమని, పరిస్థితులకు అనుగుణంగానే ఆ నిర్ణయం తీసుకున్నామని, అందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదని పరాగ్ చెప్పుకొచ్చాడు.

తన బ్యాటింగ్ ఫామ్ పైనా పరాగ్ స్పందించాడు.. జట్టుకు రెండు పాయింట్లు అందించడమే తన అసలు లక్ష్యం. జట్టు ఓడిపోయినప్పుడు తన వ్యక్తిగత స్కోరు లేదా ఇన్నింగ్స్ ఎన్ని పరుగులు ఉన్నా అది నిర్థకమేనని పరాగ్ భావోద్వేగంగా సమాధానమిచ్చాడు.