Shreyas Iyer : ఓట‌మిని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంది.. మా కొంప‌ముంచింది ఆ ఒక్క‌డే.. ఏం చేస్తాం.. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ముంబై పై ఓట‌మిని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) తెలిపాడు.

IPL 2026 Shreyas Iyer comments after PBKS vs MI match viral (pic credit@ipl)

  • ముంబై పై పంజాబ్ ఓట‌మి
  • ప్లేఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం
  • కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Shreyas Iyer : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. గురువారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఈ సీజ‌న్‌లో పంజాబ్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. కాగా.. ముంబై పై ఓట‌మిని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (38; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) వేగంగా ఆడ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. ముంబై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీశాడు. దీప‌క్ చాహ‌ర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కార్బిన్ బోష్, రాజ్ బవా చెరో వికెట్ ప‌డ‌గొట్టాడు.

Saim Ayub : పాక్ క్రికెట‌రా.. మ‌జాకానా.. 9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌.. స్టార్ ఆట‌గాడి ఇజ్జ‌త్ మొత్తం పాయె

అనంత‌రం 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై ఇండియ‌న్స్ 19.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (75 నాటౌట్; 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా ర్యాన్ రికెల్టన్ (48; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), విల్ జాక్స్ (25 నాటౌట్ ;10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) వేగంగా ఆడారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కో జాన్సెన్, చ‌హ‌ల్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

మా కొంప‌ముంచింది అత‌డే..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. ఈ ఓట‌మిని జీర్ణించుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌న్నాడు. తాను ఏ ఒక్క‌రిని పై నింద‌లు వేయ‌నన్నాడు. మ్యాచ్ హోరాహోరీగా సాగింద‌న్నాడు. అయితే.. తిల‌క్ వ‌ర్మ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను త‌మ నుంచి తాగేసుకున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. చ‌క్క‌ని షాట్లు ఆడాడ‌ని అన్నాడు. ముఖ్యంగా ఫీల్డ‌ర్ల గ్యాప్‌ల‌ను చూసుకుని ఖ‌చ్చిమైన షాట్లు ఆడాడ‌ని తెలిపాడు. మ్యాచ్ విజ‌యంలో అత‌డికి క్రెడిట్ ఇవ్వాల్సిందేన‌ని అన్నాడు.

త‌మ జ‌ట్టులోని అజ్మతుల్లా ఒమర్జాయ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడ‌ని తెలిపాడు. ఒకానొక ద‌శ‌లో తాము 170 నుంచి 180 ప‌రుగుల‌కే ప‌రిమితం అవుతామ‌ని అనుకున్నామ‌ని, అయితే.. అత‌డు త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో మ్యాచ్ మొమెంటంను త‌మ వైపుకు మార్చివేశాడ‌ని తెలిపాడు. అతను ఆడిన స్కూప్ షాట్స్ అద్భుతం అని అన్నాడు. అత‌డి వ‌ల్లే తాము 200 ప‌రుగులు చేశామ‌న్నాడు.

RCB : ఆర్‌సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తుందా?

ఇక టోర్నమెంట్‌లో ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే పంజాబ్ కింగ్స్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెల‌వాల్సి ఉంటుంది. పంజాబ్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ను మే 17 (ఆదివారం )ఆర్‌సీబీతో ఆడ‌నుంది. ఆ త‌రువాత మే 23న ల‌క్నోతో త‌ల‌ప‌డ‌నుంది. అయితే.. ఆర్‌సీబీతో మ్యాచ్‌ మ‌ధ్యాహ్నం జ‌ర‌గ‌నుంది. దీనిపై అయ్య‌ర్ మాట్లాడుతూ.. తాము ఈ రెండు మ్యాచ్‌ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామ‌ని చెప్పుకొచ్చాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెడ‌తామ‌నే ధీమాను వ్య‌క్తం చేశాడు.