Shreyas Iyer : గుజ‌రాత్‌తో మ్యాచ్ పోతే పోయింది.. స‌న్‌రైజ‌ర్స్‌కు చుక్క‌లు చూపిస్తాం.. శ్రేయ‌స్ అయ్య‌ర్ హాట్ కామెంట్స్‌..

త‌మ బౌల‌ర్లు విఫ‌లం కావ‌డంతోనే గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ఓట‌మి పాలు అయ్యామ‌ని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer)తెలిపాడు.

IPL 2026 Shreyas Iyer Comments after Punjab Kings lost match to Gujarat Titans (pic credit@ipl)

  • ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో ఓట‌మి
  • స్పందించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌
  • స‌న్‌రైజ‌ర్స్ పై గెలిచి రెండు పాయింట్లు సాధిస్తాం..

Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో విజ‌యాలతో మంచి జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు వ‌రుస‌గా రెండు షాక్‌లు త‌గిలాయి. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. గ‌త మ్యాచ్‌లో రాజ‌స్థాన్ చేతిలో కంగుతిన‌గా.. తాజాగా గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. త‌మ బౌల‌ర్లు విఫ‌లం కావ‌డంతోనే గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ఓట‌మి పాలు అయ్యామ‌ని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో సూర్యాంశ్ షెడ్జ్ (57; 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), మార్క‌స్ స్టోయినిస్ (40; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో జేస‌న్ హోల్డ‌ర్ నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్‌, రబాడ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ర‌షీద్ ఖాన్ ఓ వికెట్ సాధించాడు.

అనంత‌రం 164 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు 19.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయి సుద‌ర్శ‌న్ (57; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశ‌డు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (40 నాటౌట్‌; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్ దీప్ సింగ్‌, విజ‌య్‌కుమార్ వైశాక్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కొ యాన్సెన్‌, స్టోయినిస్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

ప‌వ‌ర్ ప్లేలోనే నాలుగు వికెట్లు.. అయినా గానీ..

ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. పిచ్ ఆరంభంలో కొత్త బంతి బౌల‌ర్ల‌కు స‌హ‌రించింది. బంతి బాగా స్వింగ్ అయిందన్నాడు. ఈ క్ర‌మంలో 164 ప‌రుగుల ల‌క్ష్యం స‌రిపోతుంద‌ని భావించిన‌ట్లుగా తెలిపాడు. గుజ‌రాత్ బౌల‌ర్లు పిచ్‌ను చాలా చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్నారు. వారు స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశార‌ని, బంతి స్టంప్స్ పైకి బౌలింగ్ చేయ‌డంతో కాస్త రూమ్ తీసుకుని ఆడే అవ‌కాశం రాలేద‌న్నారు. ఇక ప‌వ‌ర్ ప్లేలోనే తాము నాలుగు వికెట్లు కోల్పోయామ‌ని, అయిన‌ప్ప‌టికి 160 ప‌రుగులు చేయ‌డం గొప్ప విష‌యం అని చెప్పుకొచ్చాడు.

ఇక తాము కూడా కొత్త బంతితో స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి ఆరంభంలోనే వికెట్లు తీయాల‌ని భావించామ‌ని, అయితే అది సాధ్య‌ప‌డ‌లేద‌న్నాడు. అయిన‌ప్ప‌టికి కూడా మ్యాచ్‌ను చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు తీసుకువెళ్ల‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నాడు. త‌మ ప్లేయ‌ర్ల వైఖ‌రి, ఆట‌తీరు అద్భుతంగా ఉన్నాయ‌న్నాడు. త‌మ బౌల‌ర్లు స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయ‌డంలో విఫ‌లం అయ్యార‌ని తెలిపాడు.

పిచ్ పై బౌన్స్ అస్థిరంగా ఉండ‌డంతో మిడ్ వికెట్ లేదా ఫుల్ షాట్లు ఆడ‌డం అంత సుల‌భం కాద‌ని, బ్యాటింగ్‌కు చేయ‌డానికి అనువైన పిచ్ కాద‌న్నాడు. తాము ఇప్ప‌టికి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలోనే ఉన్నామ‌ని, అదే ముఖ్యం అని అన్నాడు. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామ‌న్నాడు.

గ‌త మ్యాచ్‌లో త‌మ బౌల‌ర్లు 50 నుంచి 60 ప‌రుగులు ఇచ్చి ఇక్క‌డి వ‌చ్చి అద్భుత‌మైన ఓవ‌ర్లు వేయ‌డం వ‌ల్ల వారి ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంద‌న్నాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగే త‌దుప‌రి మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామ‌ని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో విజ‌యం సాధించి రెండు పాయింట్లు సాధించుకుంటామ‌న్నాడు.