SRH vs CSK : ఉప్ప‌ల్‌లో ఉత్కంఠ పోరుకు సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ సై.. ఆధిప‌త్యం ఎవ‌రిదంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా శ‌నివారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ (SRH vs CSK) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

IPL 2026 SRH vs CSK head to head pitch report and match prediction (pic credit jiostar)

  • శ‌నివారం ఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్‌, సీఎస్‌కే మ‌ధ్య మ్యాచ్‌
  • ఇరు జ‌ట్ల ముఖాముఖి పోరులో ఆధిక్యంలో ఉన్న చెన్నై
  • గ‌త సీజ‌న్‌లో ఆడిన ఏకైక మ్యాచ్‌లో గెలిచిన స‌న్‌రైజ‌ర్స్

SRH vs CSK : ఐపీఎల్ 2026లో భాగంగా శ‌నివారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. యువ పేస‌ర్ల మెరుపుల‌తో జోరుమీదున్న ఎస్ఆర్‌హెచ్ వ‌రుస విజ‌యాల‌తో ఫామ్‌లోకి వ‌చ్చిన సీఎస్‌కే జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌డంతో ఈ మ్యాచ్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది.

ఇక ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు చెరో ఐదు మ్యాచ్‌లు ఆడాయి. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, మ‌రో రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం రెండు జ‌ట్ల ఖాతాల్లో చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే.. నెట్‌ర‌న్‌రేటు కాస్త మెరుగ్గా ఉన్న స‌న్‌రైజ‌ర్స్ (+0.576) పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉండగా.. చెన్నై సూప‌ర్ కింగ్స్ (-0.846) ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది.

హెడ్‌-టు-హెడ్ రికార్డులు..

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు 22 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఏడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా, చెన్నై సూప‌ర్ కింగ్స్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఇరు జ‌ట్ల మ‌ద్య జ‌రిగిన ఏకైక మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యం సాధించింది.

also read : ప్ర‌త్య‌ర్థుల‌కు ఇక దిబిడి దిబిడే.. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టులోకి స‌ఫారీ పేస‌ర్‌.. 145 కి.మీ వేగం..

పిచ్ రిపోర్టు..

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్ సాంప్రదాయకంగా బ్యాట్, బాల్ మధ్య సమతుల్యమైన పోటీని అందిస్తుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో పేసర్లు మంచి బౌన్స్ రాబట్టగలరు. మ్యాచ్‌ సాగేకొద్దీ బ్యాట‌ర్ల‌కు అనుకూలిస్తుంది. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన జ‌ట్లు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

తుది జ‌ట్ల అంచ‌నా..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీప‌ర్‌), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ.
ఇంపాక్ట్ సబ్ : సాకిబ్ హుస్సేన్

Also read : ఎంత ప‌ని చేశావ్ గ్రీన్‌.. కొత్త కారుకు సొట్ట పెట్టావుగా.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన టాటా..

చెన్నై సూప‌ర్ కింగ్స్‌..
సంజు శాంసన్ (వికెట కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్.
ఇంపాక్ట్ సబ్ : ప్రశాంత్ వీర్