SRH vs DC : కేఎల్ రాహుల్, నితీష్ రాణాలను బలిపశువులను చేశారుగా.. ఓటమికి గల కారణాలు వెల్లడించిన ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్..
టాప్ ఆర్డర్ వైఫల్యం కారణంగానే ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయామని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు (SRH vs DC ) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 22, 2026 / 08:51 AM IST
IPL 2026 SRH vs DC Delhi Director of Cricket Reveals Reasons Behind Defeat (pic credit@ipl)
- సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఓటమిగల కారణాలను వెల్లడించిన వేణుగోపాల రావు
- టాప్ ఆర్డర్ వైఫల్యమే కారణమని వ్యాఖ్య
SRH vs DC : టాప్ ఆర్డర్ వైఫల్యం కారణంగానే ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయామని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు తెలిపాడు. 243 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలో భారీగా పరుగులు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. కనీసం 80 నుంచి 90 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని, కేవలం 59 పరుగులు మాత్రమే చేశామన్నాడు. ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకొచ్చాడు.
‘240కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఆరు ఓవర్లలో మంచి ఆరంభం లభించడం చాలా అవసరం. ఆ సమయంలో మేము సుమారు 15 నుంచి 20 పరుగులు తక్కువ చేశామని భావిస్తున్నాను. అలాంటి భారీ స్కోరును ఛేదించాలంటే.. పవర్‌ప్లే ముగిసేసరికి 80 లేదా 90 పరుగులకు చేరువలో ఉండాలి. మాకున్న బ్యాటింగ్ డెప్త్‌తో అక్కడి నుంచి లక్ష్యాన్ని చేరుకోగలిగేవాళ్లం. అయితే పవర్‌ప్లేలో 59 పరుగులు మాత్రమే చేశాం. దీంతో అవకాశాన్ని కోల్పోయాం.’ అని వేణుగోపాల్ రావు అన్నాడు.
రాహుల్‌కు ఎక్కువగా స్ట్రైక్ రాలేదు..
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. 6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పాతుమ్ నిస్సాంక ఔట్ అయ్యాడు. అతడు ఔట్ అయిన తరువాత పవర్ ప్లేలో రాహుల్ కేవలం 6 బంతులను మాత్రమే ఎదుర్కొగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రాణా 17 బంతులను ఎదుర్కొన్నాడు. నితీష్ రాణా ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 57 పరుగులు చేసినప్పటికి కూడా ఆరంభంలో టైమింగ్ కుదరక ఇబ్బంది పడ్డాడు.
Abhishek Sharma : ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు.. అభిషేక్ శర్మ నువ్వు మామూలోడివి కాదయ్యా..
నిస్సాంక ఔట్ అయిన తరువాత కేఎల్ రాహుల్‌కు ఎక్కువగా స్ట్రైకింగ్ రాలేదు. ఇది కూడా జట్టును బాగా దెబ్బతీసింది. పవర్ ప్లేలో అతడు ఓ సిక్స్, ఫోర్ కొట్టినప్పటికి కూడా పెద్దగా బంతులను ఎదుర్కొనలేదు. దీంతో ఎక్కువగా పరుగులు చేయలేకపోయాడు. చాలా బంతులను నితీష్ రాణానే ఎదుర్కొన్నాడు. దీంతో రాహుల్ తన లయను అందుకోలేకపోయాడు. అక్కడే ముమెంటం ఎస్ఆర్‌హెచ్ వైపు మళ్లిందని నేను భావిస్తున్నాను. అని వేణుగోపాలరావు తెలిపాడు.
ఫీల్డింగ్ లోపాలపై..
అభిషేక్ శర్మను ఔట్ చేసేందుకు వచ్చిన రెండు అవకాశాలను చేజార్చుకోవడంపైనా వేణు గోపాల రావు విచారం వ్యక్తం చేశాడు. 68 బంతుల్లో 135 పరుగులతో అజేయంగా నిలిచిన అభిషేక్ శర్మకు రెండు లైఫ్ లైన్‌లు లభించాయి. తొలుత అతడు 50 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్ చేసే అవకాశాన్ని కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆతరువాత 84 లేదా 86 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను నిస్సాంక జార విడిచాడు. ఈ పొరపాట్లకు మేము భారీ మూల్యం చెల్లించుకున్నాము అని వేణుగోపాల రావు అన్నాడు.
ఈ ఓటమితో ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
