SRH vs RR : ముఖాముఖిలో రాజస్థాన్, సన్‌రైజర్స్‌లో ఎవరిది పైచేయి అంటే?
బుధవారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో (SRH vs RR) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- May 27, 2026 / 02:52 PM IST
IPL 2026 SRH vs RR head to head records pitch report
SRH vs RR : ఐపీఎల్ 2026లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. బుధవారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఇంటిముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం ఉంది.
వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు పూర్తిగా దూరమయ్యే ప్రమాదంలో పడింది. అయితే.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవడంతో సన్‌రైజర్స్ నెట్‌రన్‌రేటుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో టాప్-2లో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.
ఇక ఐపీఎల్ చరిత్రను ఓ సారి పరిశీలిస్తే.. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన తరువాత టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. 2016లో సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి.. క్వాలిఫయర్-2లో విజయం సాధించి ఫైనల్‌లో కప్పును ముద్దాడింది. ఇలాంటి అద్భుతం మరోసారి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హెడ్-టు-హెడ్ రికార్డులు..
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది.
పిచ్..
ముల్లన్‌పూర్ పిచ్ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి. ఆరంభంలో పిచ్ కాస్త పేసర్లకు సహకరిస్తూ ఉంటుంది. మంచు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకుంటాయి.
తుది జట్ల అంచనా..
ఎస్ఆర్‌హెచ్..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీశ్‌కుమార్ రెడ్డి,సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఈషాన్ మలింగ్, సాకిబ్ హుస్సేన్
Rajat Patidar : ఆర్‌సీబీ కెప్టెన్ మామూలోడు కాదయ్యా.. రజత్ పాటిదార్ నెట్‌వర్త్ ఎంతంటే?
ఇంపాక్ట్ ప్లేయర్.. కమిందు మెండిస్
రాజస్థాన్ రాయల్స్..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), దసున్ షనక, డోనోవన్ పెరీరా, శుభవ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా, నండ్రే బర్గర్, యశ్‌రాజ్ పుంజా,
ఇంపాక్ట్ ప్లేయర్.. రవి బిష్ణోయ్
