Pat Cummins : వైభవ్ సూర్యవంశీకి పాట్ కమిన్స్ వార్నింగ్.. ఔట్ చేసేందుకు ఒకటి కాదు మూడు ప్లాన్లు సిద్ధం..
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసేందుకు తమ వద్ద మూడు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins ) తెలిపాడు.
IPL 2026 Vaibhav Sooryavanshi Warned by Pat Cummins ahead of eliminator match
- బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్
- వైభవ్ సూర్యవంశీకి కమిన్స్ వార్నింగ్
Pat Cummins : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బుధవారం కీలక మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్-2కి అర్హత సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం ఉంది.
ఇక ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. ఈ చిచ్చర పిడుగు మెరుపు ఆరంభాలను అందిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌ల్లో 41.64 సగటుతో 232.27 స్ట్రైక్‌రేటుతో 583 పరుగులు చేశాడు.
Nitish Kumar Reddy : నితీశ్‌కుమార్ రెడ్డి బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్ఆర్ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో వైభవ్ విఫలం కాగా.. మరో మ్యాచ్‌లో శతక్కొట్టాడు. ఈ క్రమంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో అతడిని ఔట్ చేసేందుకు తమ మూడు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.
ఓ బౌలర్‌గా మన బలాలు ఏంటో తెలుసుకుని బౌలింగ్ చేయడం ఓ ఎత్తు. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒంటి చేత్తో లాగేసుకునే ఒకరిద్దరు ఆటగాళ్లు ఉన్నప్పుడు వారి కోసం ప్లాన్ బి లేదా ప్లాన్ సి సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీని కోసం కొంత ఎక్కువ సమయం కేటాయిస్తాము.
Rajat Patidar : ఆర్సీబీ కెప్టెన్ మామూలోడు కాదయ్యా.. రజత్ పాటిదార్ నెట్‌వర్త్ ఎంతంటే?
ఇక వైభవ్ సూర్యవంశీ కోసం తాము ప్రత్యేకమైన వ్యూహాలను రచిస్తున్నట్లు చెప్పాడు. గత మ్యాచ్‌లో అతడు సెంచరీ చేసినప్పటికి కూడా కొన్ని ఓవర్లలో అతడిని కట్టగడి చేయగలిగాము. మొత్తంగా ఆ మ్యాచ్ నుంచి నేర్చుకున్న పాఠాలు ఎలిమినేటర్‌లో ఉపయోగపడతాయని, రాజస్థాన్ ప్లేయర్ల ఆటతీరుపై మంచి అవగాహన ఉందని కమిన్స్ తెలిపాడు.
