IPL 2026: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్.. ఓటమి రుచి చూపించిన హైదరాబాద్
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.
- Naveen
- Updated on- April 14, 2026 / 12:08 AM IST
IPL 2026: ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో తొలి ఓటమిని చవి చూసింది. వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న రాజస్తాన్ కు ఓటమి రుచి చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది హైదరాబాద్. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్.. 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 57 పరుగుల తేడాతో హైదరాబాద్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది రెండో విజయం. ఐదు మ్యాచులు ఆడగా మూడింటిలో ఓటమిపాలైంది. అటు రాజస్థాన్ 5 మ్యాచులు ఆడగా ఇదే తొలి పరాజయం.
హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో హింగ్, షకీబ్ హస్సన్ చెలరేగారు. తలో 4 వికెట్లు పడగొట్టారు.
