Vaibhav Sooryavanshi : బుడ్డోడి గుండె పగిలింది.. డగౌట్‌లో ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ.. ముఖం పై టవల్ కప్పుకుని.. వీడియో
ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ జట్టు ఫైనల్‌కు చేరుకోకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) తీవ్ర నిరాశకు గురి అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 30, 2026 / 08:17 AM IST
IPL 2026 Vaibhav Sooryavanshi breaks down in tears after Rajasthan Royals fail to qualify final
- క్వాలిఫయర్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన రాజస్థాన్
- తీవ్ర నిరాశ చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
- డగౌట్‌లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ జట్టు ఫైనల్‌కు చేరుకోకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశకు గురి అయ్యాడు. శుక్రవారం ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వైభవ్ అద్భుతంగా ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు.
అయితే.. అతడి పోరాటం వృథా అయింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం (మార్చి 31న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ కప్పు కోసం పోటీపడనుంది.
కాగా.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయిన తరువాత వైభవ్ సూర్యవంశీ కలత చెందాడు. అతడు డగౌట్‌లో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. డగౌట్‌లో ఒంటరిగా కూర్చుని టవల్‌తో తన ముఖాన్ని కప్పుకున్నాడు. అంతేకాదు.. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్నప్పుడు కూడా అతడి ముఖంలో నిరాశ చాలా స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (45; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డోనోవన్ ఫెరీరా (38నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించారు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు తలా ఓ వికెట్ తీశారు.
Riyan Parag : నా వల్ల కాలేదు.. బుడ్డోడే కప్పును అందిస్తాడు.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
Out of the park, a win in the bag 👊@gujarat_titans reach the final in a sublime fashion 🤩💙
Scorecard ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/zM5Zh9nUc7
— IndianPremierLeague (@IPL) May 29, 2026
215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (104; 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ బాదాడు. సాయి సుదర్శన్ (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం బాదాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మలు తలా ఓ వికెట్ సాధించారు.
