ఐపీఎల్ ప్రసారాలను ఆపేయనున్న పాకిస్తాన్

దాడి జరిగి వారాలు గడిచిపోయినా ఇరు దేశాల మధ్య చిచ్చు మాత్రం రగులుతూనే ఉంది. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్-పాక్‌ల మధ్య మినీ సైజు యుద్ధమే జరిగింది. పూర్తిగా పాక్‌ నుంచి సంబంధాలు తెంచుకోవాలనే యోచనలో ఉంది బీసీసీఐ. ఇందులో భాగంగానే ఒక అడుగు ముందుకేసి టోర్నీలో ఆడకుండా ఉండేందుకు ఆలోచనలు చేస్తుంటే.. పాక్ దానికి ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. 
Read Also : కోహ్లీ.. అనుష్క రొమాంటిక్ స్టీల్ యాడ్

పుల్వామా ఘటన జరిగిన సమయంలో పాకిస్తాన్ లో పీఎస్ఎల్ జరుగుతుంది. ఆ లీగ్ ప్రసారాలను భారత్ నిలిపేసింది. దానికి ప్రతీకారంగా మార్చి 23నుంచి భారత్ లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ప్రసారాలను పాక్ నిలిపివేయాలని నిర్ణయించుకుందంట. ఐపీఎల్ ప్రసారాలను పాక్‌లో నిలిపివేయాలంటూ పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ ఆజ్ఞలు జారీ చేశాడు. 
 
‘పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతున్న సమయంలో భారత ప్రసార సంస్థలు, ప్రభుత్వం పాకిస్థాన్‌‌పై వివక్ష చూపాయి. అదే కారణంతో మేం కూడా భారత్‌ను ఉపేక్షించాలని అనుకోవడం లేదు. ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్థాన్‌లో నిలిపేస్తే.. భారత్‌కు కచ్చితంగా నష్టం చేకూరుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే పాకిస్థాన్ ఓ సూపర్ పవర్‌గా నిలిచింది’ అని మంత్రి వివరించాడు. 
Read Also : IPL 2019: ఆర్మీ దుస్తుల్లో KXIP హోలీ సంబరాలు