IPL 2022: ‘మీడియా హక్కులు లీగ్ డెవలప్మెంట్ కు హెల్ప్ అవుతాయి’

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై మీడియా హక్కులు ప్రభావం చూపిస్తాయి. ప్రత్యేకించి మరో రెండు ఫ్రాంచైజీలను యాడ్ చేయడం వల్ల డిజిటల్ గ్రోత్ కనిపిస్తుందంటూ ఇండియన్ క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ)...

Ipl 2022

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై మీడియా హక్కులు ప్రభావం చూపిస్తాయి. ప్రత్యేకించి మరో రెండు ఫ్రాంచైజీలను యాడ్ చేయడం వల్ల డిజిటల్ గ్రోత్ కనిపిస్తుందంటూ ఇండియన్ క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ) సెక్రటరీ జై షా అంటున్నారు.

‘ఐపీఎల్ బ్రాండ్ పై ప్రతి ఒక్కరి అంచనాలు పెరిగిపోతున్నాయి’ అని జైషా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆదాయాన్ని డాలర్లలో చర్చించేందుకు నిరాకరించిన ఆయన.. విలువ అనేది లీగ్ వృద్ధిపై ఆధారపడి ఉంటుందని కామెంట్ చేశారు.

ఐపీఎల్ 2023-27 మీడియా హక్కుల కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్లకు ఆహ్వానించనుంది. దాదాపు 500 బిలియన్ రూపాయల వరకూ ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తమ వద్దకు వచ్చిన మోడల్స్, ప్రపోజల్స్ ను బోర్డు పరిశీలించిందని టీవీ, డిజిటల్ బిడ్స్ ను సపరేట్ గా పరిశీలిస్తామని షా అన్నారు.

Read Also: 25శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు

Amazon.com Inc వేసిన వేలాన్ని మాత్రమే ఒప్పుకునేలా కనిపిస్తుంది. 2018-22 సైకిల్ హక్కులను వాల్ట్ డిస్నీ రూ.163.48 బిలియన్లకు సొంతం చేసుకుంది. లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు ఎంట్రీల కోసం బీసీసీఐకి 1.7 బిలియన్ డాలర్లు చెల్లించాయి.