IPL Vs PSL
IPL Vs PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగులు ఉన్నప్పటికి కూడా క్రికెట్ ఆడే ఆటగాళ్లు అందరూ కనీసం ఒక్కసారి అయిన ఐపీఎల్‌లో ఆడాలని కలలు కంటుంటారు. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ లీగ్ పై కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం ఎల్లప్పుడూ విషం కక్కుతుంటారు.
ఐపీఎల్ కంటే పాక్‌లో నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు ఇష్టపడుతుంటారని పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మండిపడ్డాడు. రిజ్వాన్ చేసిన వ్యాఖ్యల్లో అర్ధం లేదన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రికెట్ లీగుల్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం అని చెప్పాడు.
IPL 2023, MI vs CSK: గెలవని జట్ల మధ్య పోరు.. బోణీ ఎవరిదో..?
ఐపీఎల్ జరిగేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాగం క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోతాయన్నాడు. అంతర్జాతీయ ఆటగాళ్లలో ఎక్కువ మంది ఐపీఎల్ ఆడేందుకే ఆసక్తి చూపిస్తుంటారన్నాడు. ఆస్ట్రేలియా కీలక ఆటగాడు స్టీవ్ స్మిత్ సైతం ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపినా ఏ ఒక్క ప్రాంచైజీ అతడికి తీసుకోలేదని, అదే పాకిస్తాన్ సూపర్ లీగ్ మొత్తం అంతా రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో నిండిపోయిందని ఎద్దేవా చేశాడు కనేరియా.