IPL2022 CSK Vs DC : దంచికొట్టిన డేవన్ కాన్వే.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. డేవన్‌ కాన్వే (87), రుతురాజ్‌ గైక్వాడ్ (41) ధాటిగా ఆడారు. దీంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది.

Ipl2022 Csk Vs Dc

IPL2022 CSK Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. దీంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది. చెన్నై ఓపెనర్లు డేవన్‌ కాన్వే (87), రుతురాజ్‌ గైక్వాడ్ (41) ధాటిగా ఆడారు. శుభారంభం ఇచ్చారు.

డేవన్ కాన్వే 49 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. శివమ్‌ దూబే (32), ఎంఎస్ ధోనీ (21*) దూకుడుగా ఆడారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

Virat Kohli: ఐపీఎల్ 2022లో మూడోసారి గోల్డెన్ డక్‌గా విరాట్

ఢిల్లీకి 209 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఆరంభ ఓవర్లలో ఆచితూచి ఆడిన ఓపెనర్లు… తర్వాత వేగంగా పరుగులు సాధించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను తీయడంతో చెన్నై ఇంకా ఎక్కువ పరుగులు చేయకుండా ఢిల్లీ బౌలర్లు అడ్డుకోగలిగారు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్‌ నోర్జే మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీశాడు.

IPL2022 CSK Vs DC Delhi Capitals Target 209

కాగా, ఢిల్లీ నెట్ బౌలర్‌ కరోనా బారిన పడటంతో ఢిల్లీ, చెన్నై మధ్య మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మ్యాచ్‌ ప్రారంభమైంది. చెన్నైతో పోరులో టాస్‌ నెగ్గిన రిషబ్ పంత్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఢిల్లీ ప్రతి మ్యాచ్‌ను నెగ్గాలి. హైదరాబాద్‌పై ఘన విజయంతో ఉన్న ఢిల్లీ అదే ఊపును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారిన వేళ ఢిల్లీ ఛాన్స్‌లను ఏ మాత్రం ప్రభావితం చేస్తుందో చూడాలి. ధోనీ సారథ్యం చేపట్టిన రెండో మ్యాచ్‌లో చెన్నై మళ్లీ ఓడింది.

Chris Gayle: “నాకు గౌరవం దక్కలేదు.. అలా జరగాల్సిందే”

జట్ల వివరాలు:

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), శివమ్‌ దూబే, డ్వేన్ బ్రావో, డ్వేన్ బ్రావో, మహీషా తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముకేశ్‌ చౌదరి

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, శ్రీకర్‌ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్‌ పంత్ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్‌ నోర్జే.