Ipl2022 Gt Vs Pbks
IPL2022 GT Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్ లో అగ్రశ్రేణి జట్లను ఓడిస్తూ వరుస విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుని దూకుడు మీదున్న గుజరాత్‌కు పంజాబ్ షాక్ ఇచ్చింది. మొదట బాల్ తో చెలరేగిన పంజాబ్, తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. 8 వికెట్ల తేడాతో గుజరాత్ ను ఓడించింది.
MS Dhoni: కెప్టెన్ రిటర్న్స్, వచ్చే ఏడాది కూడా సీఎస్కే జెర్సీతోనే
గుజరాత్ నిర్దేశించిన 144 పరుగుల స్వల్ప టార్గెట్ ను 2 వికెట్లు కోల్పోయి.. 16 ఓవర్లలోనే ఛేదించింది పంజాబ్. బ్యాటింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (53 బంతుల్లో 62*), రాజపక్స (28 బంతుల్లో 40) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. బెయిర్‌స్టో (1) విఫలమైనా.. ఆఖర్లో లివింగ్‌స్టోన్ (10 బంతుల్లో 30*) బౌండరీల మోత మోగించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ చెరో వికెట్ తీశారు. 16వ ఓవర్లలో పంజాబ్ ఆటగాడు లివింగ్ స్టోన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా 6,6,6,4,2,4 పరుగులతో మొత్తం 28 పరుగులు రాబట్టాడు. దీంతో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది పంజాబ్ కింగ్స్.
IPL2022 GT Vs PBKS Punjab Kings won by 8 wickets on gujarat titans
ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు చెలరేగారు. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత బ్యాటర్లు పరుగులు చేసేందకు కష్టపడ్డారు. గుజరాత్ స్పల్ప స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (64*) ఒంటరిపోరాటం చేశాడు. దాంతో గుజరాత్ 143 పరుగుల స్కోర్ అయినా చేయగలిగింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (9), వృద్ధిమాన్ సాహా (21), హార్దిక్ పాండ్య (1), డేవిడ్ మిల్లర్ (11), పరుగులు చేయలేకపోయారు. ఫినిషర్‌గా మారిన రాహుల్ తెవాతియా (11) విఫలమయ్యాడు. రషీద్ ఖాన్ (0), ప్రదీప్ సాంగ్వాన్ (2), ఫెర్గుసన్ (5) స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ చెలరేగాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టన్ తలో వికెట్ తీశారు.
IPL2022 Rajasthan Vs KKR : రాణించిన రానా, రింకూ సింగ్.. కోల్‌కతా వరుస ఓటములకు బ్రేక్
ఈ సీజన్ లో గుజరాత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గుజరాత్ (16) ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోగా.. పంజాబ్ విజయాల కోసం పోరాడుతోంది. గుజరాత్ 10 మ్యాచులు ఆడగా.. అందులో 8 విజయాలు, రెండు ఓటములు ఉన్నాయి. ఇక పంజాబ్ 10 మ్యాచులు ఆడగా అందులో 5 విజయాలు, 5 ఓటములు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్ (10) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సి ఉంటుంది.
జట్ల వివరాలు:
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ.
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ.
That’s that from Match 48.@PunjabKingsIPL win by 8 wickets with four overs to spare.
Scorecard – https://t.co/LcfJL3mlUQ #GTvPBKS #TATAIPL pic.twitter.com/qIgMxRhh0B
— IndianPremierLeague (@IPL) May 3, 2022