MS Dhoni: కెప్టెన్ రిటర్న్స్, వచ్చే ఏడాది కూడా సీఎస్కే జెర్సీతోనే

నాలుగు సార్లు సీఎస్కే ఫ్రాంచైజీకి ట్రోఫీ తెచ్చిపెట్టిన ధోనీ IPL 2022లో 46వ మ్యచ్ కు టాస్ వేసే సమయంలో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో అడుగుపెట్టగానే అభిమానులు సందడి చేశారు.

MS Dhoni: కెప్టెన్ రిటర్న్స్, వచ్చే ఏడాది కూడా సీఎస్కే జెర్సీతోనే

Ms Dhoni

 

 

MS Dhoni: కెప్టెన్ గా ధోనీ మరోసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. నాలుగు సార్లు సీఎస్కే ఫ్రాంచైజీకి ట్రోఫీ తెచ్చిపెట్టిన ధోనీ IPL 2022లో 46వ మ్యచ్ కు టాస్ వేసే సమయంలో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో అడుగుపెట్టగానే అభిమానులు సందడి చేశారు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ భవితవ్యం గురించి కూడా మాట్లాడాడు.

“వచ్చే ఏడాది కూడా మీరు నన్ను ఎల్లో జెర్సీలోనే చూస్తారు. జెర్సీలో మార్పులు ఉండొచ్చు. నా భాగస్వామ్యంలో కాదు” అని కేన్ విలియమ్సన్ టాస్ గెలిచిన అనంతరం ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గా చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడారు.

టాస్ కోసం ధోనీ గ్రౌండ్ లోకి నడుచుకుంటూ వస్తుండగా.. మరోసారి ధోనీ కెప్టెన్సీ తీసుకున్నాడని అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు సరిగ్గా రెండ్రోజుల ముందే ధోనీ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 8మ్యాచ్ లు చూసిన తర్వాత మరోసారి కెప్టెన్సీని రిటర్న్ తీసుకున్నాడు.

అనూహ్యంగా ఏప్రిల్ 30న జడేజాకు కెప్టెన్సీ ఇస్తున్నట్లు ఎంఎస్ ధోనీ ప్రకటించాడు. ఎనిమిది మ్యాచ్ ల అనంతరం.. ఆల్ రౌండర్ జడేజా గేమ్ పై మరింత ఫోకస్ పెట్టాలని స్టేట్మెంట్ ఇవ్వగా ధోనీ కెప్టెన్ గా మరోసారి రింగ్ లోకి వచ్చాడు. 8మ్యాచ్ లలో కేవలం 2మాత్రమే గెలిచిన సీఎస్కే భారం ధోనీని ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో పడేసింది.

“ప్రస్తుత పరిస్థితిని బట్టి రియలైజ్ అవ్వాలి. క్యాచ్ లు మిస్ చేశాం. అటువంటి పరిస్థితులను మరిచిపోవాలి. వాటిపైనే ఫోకస్ పెంచాలనుకుంటున్నాం” ధోనీ గేమ్ ఇంప్రూవ్మెంట్ గురించి వివరించారు.