Ipl2022 Rcb Vs Rr
IPL2022 RCB Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు విజృంభించారు. బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్న రాజస్తాన్‌ను మోస్తరు పరుగులకే కట్టడి చేశారు.
అయితే లోయర్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్ (56*) అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బెంగళూరుకు 145 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభంలో పరుగులు చేసేందుకు రాజస్తాన్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.
Innings Break!
Brilliant bowling effort from @RCBTweets restricts #RR to a total of 144/8 on the board.
Scorecard – https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/gCq3webZZw
— IndianPremierLeague (@IPL) April 26, 2022
లోయర్ ఆర్డర్ లో వచ్చిన రియాన్ పరాగ్ దంచికొట్టాడంతో ఆ స్కోర్ అయినా వచ్చింది. పరాగ్‌తోపాటు సంజూ శాంసన్ (27) రాణించాడు. అశ్విన్ (17), డారిల్ మిచెల్ (16) ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్ ఓ మోస్తరు స్కోరును చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హేజిల్‌వుడ్, హసరంగా తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
IPL2022 CSK Vs PBKS : చివర్లో చేతులెత్తేసిన చెన్నై.. మళ్లీ ఓటమి బాట.. పంజాబ్ చేతిలో చిత్తు
కాగా, ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉండి పరుగుల వరద పారిస్తున్న సెంచరీల హీరో జోస్ బట్లర్ బెంగళూరుపై రాణించలేకపోయాడు. బట్లర్ 9 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఐదో ఓవర్ లో హేజిల్ వుడ్ బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు బట్లర్. 2 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకుని రాజస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్తాన్ మూడో స్థానంలో ఉంది. రాజస్తాన్ ఆడిన ఏడు మ్యాచుల్లో 5 గెలిచింది. బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఆడిన 8 మ్యాచుల్లో 5 గెలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రాజస్తాన్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యల్ప స్కోరుకే (68) పరిమితమైన బెంగళూరు.. ఈ మ్యాచ్ లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. లీగ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్తాన్ పట్టుదలగా ఉంది. ఇక గత రికార్డులు పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు తలపడిన సందర్భాల్లో బెంగళూరు 13 విజయాలతో రాజస్తాన్ రాయల్స్ పై(10) ఆధిపత్యం సాధించింది.
IPL2022 MI Vs LSG : మారని ముంబై తీరు.. వరుసగా 8వ పరాజయం.. లక్నో ఘన విజయం
జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూయష్ ప్రభుదేశాయ్, రాజత్ పాటిదార్, షాహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్
రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), హెట్ మైర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్‌దీప్ సేన్, ప్రసిధ్ కృష్ణ, యుజువేంద్ర చాహల్
A 56* off 31 deliveries from @ParagRiyan makes him our Top Performer from the first innings.
A look at his batting summary here ?? #TATAIPL #RCBvRR pic.twitter.com/dydyVwEC1L
— IndianPremierLeague (@IPL) April 26, 2022