IPL2022 MI Vs LSG : మారని ముంబై తీరు.. వరుసగా 8వ పరాజయం.. లక్నో ఘన విజయం

ముంబై ఇండియన్స్ తీరు మారలేదు. ఈ సీజన్ లో మరో పరాజయం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓటమి పాలైంది.

IPL2022 MI Vs LSG : మారని ముంబై తీరు.. వరుసగా 8వ పరాజయం.. లక్నో ఘన విజయం

Ipl2022 Mi Vs Lsg

IPL2022 MI Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్ తీరు మారలేదు. పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కి మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పరాజయం పాలైంది. ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా 7వ ఓటమి. లక్నో జట్టు నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితం అయ్యింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో లక్నో జట్టు విక్టరీ కొట్టింది. ముంబై బ్యాటర్లు మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు.

ముంబై బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులతో(31 బంతులు) రాణించాడు. తిలక్ వర్మ 38 పరుగులు, పొలార్డ్ 19 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు. మోహ్‌సిన్ ఖాన్, జాసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, అయుష్ బదోని తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి ముంబై బోణీ కొడుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, వారి ఆశలు ఫలించలేదు.

IPL2022 KKR Vs GT : ఉత్కంఠపోరులో కోల్‌కతాపై గుజరాత్‌దే విజయం.. టాప్‌లోకి హార్ధిక్ గ్యాంగ్

వరుసగా ఆడిన 8 మ్యాచుల్లోనూ ఓడిన ముంబై… పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబయి బ్యాటర్లలో రోహిత్ శర్మ (39), తిలక్‌ వర్మ (38), ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. రాహుల్ 62 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. కాగా, కేఎల్ రాహుల్ కి ఈ సీజన్ లో ఇది రెండోవ సెంచరీ. ఓవరాల్ గా నాలుగవది. లక్నో మిగతా బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌ (10), మనీశ్ పాండే (22), స్టొయినిస్‌ (0), కృనాల్‌ పాండ్య (1), దీపక్‌ హుడా (10), ఆయుష్‌ బదోనీ (14) పరుగులు చేశారు. హోల్డర్‌ (0) నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో కీరన్ పొలార్డ్, మెరిడీత్ తలో రెండు వికెట్లు తీశారు. డానియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.

IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ టీమ్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్, డేవాల్డ్‌ బ్రెవిస్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, కీరన్‌ పొలార్డ్, హృతిక్‌ షోకీన్‌, డానియల్ సామ్స్, జయ్‌దేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, బుమ్రా

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ : క్వింటన్‌ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), మనీశ్ పాండే, కృనాల్ పాండ్య, దీపక్ హుడా, ఆయుష్‌ బదోని, మార్కస్ స్టొయినిస్, జాసన్‌ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్ ఖాన్