IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం

ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ అదరగొట్టింది.

IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం

Ipl2022 Rcb Vs Srh

IPL2022 RCB Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది.

బెంగళూరు నిర్దేశించిన 69 పరుగుల స్వల్ప టార్గెట్ ను కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది హైదరాబాద్. 8 ఓవర్లలో 72 పరుగులు చేసింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్‌ అభిషేక్ శర్మ (47) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి వికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ (16*)తో కలిసి 64 పరుగులు జోడించాడు. బౌండరీ కొడదామని ప్రయత్నించి హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో అనుజ్‌ రావత్‌ చేతికి చిక్కాడు. రాహుల్‌ త్రిపాఠి(7*)తో కలిసి కేన్‌ మరో వికెట్ పడనీయకుండా ఇన్నింగ్స్‌ను ముగించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరగడంతో 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టుకి ఇది వరుసగా 5వ విజయం కావడం విశేషం. ఈ విజయంతో హైదరాబాద్‌ (10) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. 12 పాయింట్లతో టాప్ 1 లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఉంది.

IPL2022 RR Vs DC : ఉత్కంఠపోరులో రాజస్తాన్‌దే విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ

ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్ విలియమ్ సన్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని హైదరాబాద్ బౌలర్లు వమ్ము చేయలేదు. హైదరాబాద్ బౌలర్లు చెలరేగిపోయారు. బంతితో నిప్పులు చెరిగారు. బెంగళూరు బ్యాటర్లను బెంబేలెత్తించారు. హైదరాబాద్‌ బౌలర్ల దెబ్బకు 16.1 ఓవర్లలోనే 68 పరుగులకే బెంగళూరు కుప్పకూలింది. హైదరాబాద్ ముందు 69 పరుగుల స్వల్ప టార్గెట్ నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్ సెన్, నటరాజన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. జగదీశా సుచిత్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.

ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ నుంచే బెంగళూరు వికెట్ల పతనం ప్రారంభమైంది. హైదరాబాద్‌ బౌలర్ మార్కో మాన్‌సెన్‌ (3/25) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి బెంగళూరు కుప్పకూలడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత నటరాజన్‌ (3/10) విజృంభించాడు. వీరితోపాటు సుచిత్ (2/12), ఉమ్రాన్ మాలిక్ (1/13), భువనేశ్వర్ (1/8) చెలరేగడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ, అనుజ్‌ రావత్, దినేశ్ కార్తిక్ డకౌట్‌ కాగా.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ 12, ప్రభుదేశాయ్‌ 15, హసరంగ 8, షాహ్‌బాజ్ 7, డుప్లెసిస్‌ 5, హర్షల్‌ పటేల్ 4, హేజిల్‌వుడ్ 3*, సిరాజ్‌ 2 పరుగులు చేశారు. బెంగళూరు బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్‌ (12), ప్రభుదేశాయ్‌ (15) తప్పితే ఎవరూ పది పరుగులు కూడా చేయలేదు. తక్కువ పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ సీజన్ లో బెంగళూరు జట్టు చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

IPL2022 CSK VS MI : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం

ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు.. అందులో ఒకరు టాప్‌ బ్యాటర్‌ గోల్డెన్‌ డక్ కాగా.. మంచి ఫామ్‌లో ఉన్న ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. డుప్లెసిస్‌ (5), అనుజ్‌ రావత్‌ (0), విరాట్ కోహ్లీ (0)ను ఒకే ఓవర్‌లో హైదరాబాద్‌ బౌలర్ మార్కో జాన్‌సెన్‌ ఔట్‌ చేసి సంచలనం సృష్టించాడు. డుప్లెసిస్‌ను బౌల్డ్‌ చేయగా.. మిగతా ఇద్దరు మార్‌క్రమ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరారు.