CV Anand : ఇప్పటికే ఐదు సంవత్సరాలు లేటైంది.. సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటంపై ఐపీఎస్ ఆఫీసర్ సీవీఆనంద్
ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చాడు.
- Thota Vamshi Kumar
- Updated on- February 15, 2024 / 08:12 PM IST
IPS officer CV Anand on Sarfaraz Khan's debut
CV Anand – Sarfaraz Khan : ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చాడు.
కాగా.. సర్ఫరాజ్ మంచి ప్రదర్శన చేస్తాడా..? మీకు ఏమని అనిపిస్తుంది.? అని ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్‌ను రియాజ్ అనే నెటిజన్ మ్యాచ్‌కు ముందు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో అడిగారు. దీనిపై సీవీ ఆనంద్ స్పందించారు. మూడు పర్యటనల్లో తన కుమారుడు సీవీ మిలింద్, సర్ఫరాజ్ ఖాన్ సహచరులు కావడంతో అతడిని అండర్ 19 మ్యాచ్‌ల దగ్గర నుంచి చూస్తున్నట్లు చెప్పారు. ఆసియాకప్, అండర్ 19 ప్రపంచకప్‌లో కలిసి ఆడిన కొంత మంది.. శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా లాంటి వాళ్లు జాతీయ జట్టులో స్థానం పొందారన్నారు.
Sarfaraz Khan : జడేజా స్వార్థం వల్లే సర్ఫరాజ్ ఖాన్ రనౌట్..! రోహిత్ శర్మ ఆగ్రహం
దుబాయ్‌లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌ను స్వయంగా చూసినట్లు తెలిపారు. ఒత్తడి సమయాల్లోనూ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినట్లు చెప్పుకొచ్చారు. ముంబై, భారత్-ఏ జట్టు తరుపున గత రెండు సంవత్సరాలుగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతోనే సీనియర్ టీమ్‌లోకి వచ్చాడన్నారు. అయితే.. అతడు టీమ్ఇండియాలోకి ఐదు సంవత్సరాల ఆలస్యంగా వచ్చినట్లు తాను భావిస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. అరంగ్రేటం మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. 66 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 1సిక్స్ బాది 62 పరుగులు చేశాడు. సెంచరీ దిశగా దూసుకువెలుతున్న అతడు దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు.
