Sarfaraz Khan : జ‌డేజా స్వార్థం వ‌ల్లే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ర‌నౌట్‌..! రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

టీమ్ఇండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ను దుర‌దృష్టం వెంటాడింది.

Sarfaraz Khan : జ‌డేజా స్వార్థం వ‌ల్లే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ర‌నౌట్‌..! రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

Sarfaraz Khan run out on debut leaves Rohit Sharma fuming

Sarfaraz Khan-Ravindra Jadeja : టీమ్ఇండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ను దుర‌దృష్టం వెంటాడింది. అరంగ్రేట మ్యాచ్‌లోనే హాఫ్ సెంచ‌రీ బాదీ మంచి ఊపు మీదున్న అత‌డు ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. అయితే.. ర‌నౌట్‌లో అత‌డి పొర‌బాటు ఏమీ లేదు. దీన్ని చూసిన అభిమానుల హృద‌యం ముక్క‌లు కాగా.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేసిన ప‌ని ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

రాజ్‌కోట్ వేదిక‌గా మొద‌లైన మూడో టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఔట్ కావ‌డంతో క్రీజులోకి వ‌చ్చాడు. ఆరో స్థానంలో బ‌రిలోకి దిగిన ఈ 26 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాట‌ర్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటూ వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు. జ‌డేజాతో క‌లిసి 77 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

T20 World Cup 2024 : హార్దిక్ పాండ్య‌ను కాద‌ని.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. ఎందుకో తెలుసా?

66 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్‌తో 62 ప‌రుగులు చేసి మంచి ఊపుమీదున్న స‌మ‌యంలో దుర‌దృష్ట వ‌శాత్తు ర‌నౌట్ అయ్యాడు. 82వ ఓవ‌ర్‌లో అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో జ‌డేజా షాట్ ఆడాడు. ప‌రుగు తీసి సెంచ‌రీ పూర్తి చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో జ‌డేజా ఉన్నాడు. ఈ క్ర‌మంలో జ‌డ్డూ ప‌రుగు కోసం పిల‌వ‌డంతో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ముందుకు వెళ్లాడు. అయితే.. బాల్‌ను ఫీల్డ‌ర్ అందుకోవ‌డంతో జ‌డేజా వెన‌క్కి త‌గ్గాడు. అయితే.. అప్ప‌టికే క్రీజు నుంచి చాలా దూరం వెళ్లిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ వెన‌క్కి వ‌చ్చేలోపే మార్క్‌వుడ్ వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. దీంతో స‌ర్ఫరాజ్ ఇన్నింగ్స్ ముగిసింది.

దీన్ని చూసిన అభిమానులు నిరాశ చెందారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అయితే తీవ్ర అస‌హ‌నానికి లోనైయ్యాడు. త‌న క్యాప్‌ను తీసి నేల‌కేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. జ‌డేజా స్వార్థం వ‌ల్లే స‌ర్ఫ‌రాజ్ ర‌నౌట్ అయ్యాడు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌లో రప్ఫాడించిన రోహిత్‌, జ‌డేజా.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్‌.. ముగిసిన తొలి రోజు ఆట‌