T20 World Cup 2024 : హార్దిక్ పాండ్య‌ను కాద‌ని.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. ఎందుకో తెలుసా?

వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు భార‌త జ‌ట్టుకు ఎవ‌రు నాయ‌కత్వం వ‌హిస్తారా అనే సందేహాల‌కు తెర‌ప‌డింది.

T20 World Cup 2024 : హార్దిక్ పాండ్య‌ను కాద‌ని.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. ఎందుకో తెలుసా?

Why Rohit Sharma And Not Hardik Pandya As India's Captain At 2024 T20 World Cup

T20 World Cup : వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు భార‌త జ‌ట్టుకు ఎవ‌రు నాయ‌కత్వం వ‌హిస్తారా అనే సందేహాల‌కు తెర‌ప‌డింది. టీమ్ఇండియాకు హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌నే సార‌థ్యం వ‌హిస్తాడ‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. హార్దిక్ పాండ్య టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని గతంలో వార్త‌లు వ‌చ్చాయి. ఆ మేర‌కు కొన్ని సిరీస్‌ల‌కు పొట్టి ఫార్మాట్‌లో భార‌త జ‌ట్టుకు అత‌డు నాయ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. ఇప్పుడు రోహిత్ కెప్టెన్‌గా వ్య‌వ‌హరిస్తాడ‌ని స్వ‌యంగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి చెప్ప‌డంతో అన్ని అనుమానాలు తొల‌గిపోయాయి.

గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో హార్దిక్ పాండ్య గాయ‌ప‌డ్డాడు. ఇంకా ఆ గాయం నుంచి అత‌డు కోలుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే రోహిత్ శ‌ర్మ‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో న‌డిపించ‌నున్నాడు.

ఇంత‌క‌ముందు భార‌త జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ అన్ని ఫార్మాట్ల‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 సెమీ ఫైన‌ల్ త‌రువాత నుంచి అత‌డు సంవ‌త్స‌ర‌కాలం పాటు పొట్టి ఫార్మాట్‌లో ఆడ‌లేదు. కాగా.. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో పొట్టి ఫార్మాట్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌లో రప్ఫాడించిన రోహిత్‌, జ‌డేజా.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్‌.. ముగిసిన తొలి రోజు ఆట‌

ఇదే విష‌యాన్ని జైషా ప్ర‌స్తావించాడు. అత‌డిని ముందుకు సాగ‌నివ్వాల‌ని తాము భావించిన‌ట్లు చెప్పాడు. అదే స‌మ‌యంలో హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇవ్వ‌క‌పోవ‌డంపై స్పందిస్తూ ఇలా అన్నాడు. ప్రపంచకప్‌లో హార్దిక్ గాయపడితే ఇంకా ఎవరికి కెప్టెన్సీ ఇవ్వగలం? అని అత‌డు ప్ర‌శ్నించాడు. అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ 22 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన భార‌త్‌ను రోహిత్ ఆదుకున్నాడు. జ‌ట్టు స్కోరును 212/4 కు తీసుకువెళ్లాడు. ఇది చాలదా అత‌డిలో ఇంకా స‌త్తా ఉంది అని చెప్ప‌డానికి అని జైషా అన్నాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ రోహిత్ నాయ‌క‌త్వంలో ఆడింది. ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఫైన‌ల్ మ్యాచ్ ఒక్క‌టి మిన‌హాయిస్తే వ‌రుస‌గా 10 మ్యాచుల్లో గెలిచారు క‌దా. ఇప్పుడు అంద‌రికి ఓ వాగ్దానం చేయాల‌ని అనుకుంటున్నాను. బార్బడోస్‌లో (టీ20ప్రపంచ కప్ 2024ఫైనల్ వేదిక) రోహిత్ నాయ‌క‌త్వంలో భార‌త జెండాను ఎగుర‌వేస్తామ‌ని అనే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని జైషా చెప్పారు.

Ball of the century : ఏం బౌలింగ్ అన్నా ఇదీ! కువైట్ నుంచి ఒమ‌న్‌ వ‌ర‌కు స్పిన్ తిప్పావుగా!