Ireland all rounder Curtis Campher made history 5 balls 5 wickets
టీ20 క్రికెట్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫెర్ అరుదైన ఘనత సాధించాడు. 5 బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 ట్రోఫీలో అతడు ఈ ఘనత సాధించాడు.
ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 ట్రోఫీలో భాగంగా గురువారం మన్‌స్టర్ రెడ్స్, నార్త్ వెస్ట్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మన్‌స్టర్ రెడ్స్ కు కర్టిస్ కాంఫెర్ ప్రాతినిథ్యం వహించాడు. ఐదు బంతుల్లో 5 వికెట్లు తీశాడు. అయితే.. అతడు ఒకే ఓవర్‌లో ఈ ఘనత సాధించలేదు.
𝟱 𝗕𝗔𝗟𝗟𝗦, 𝟱 𝗪𝗜𝗖𝗞𝗘𝗧𝗦!
Ireland all-rounder Curtis Campher made history.pic.twitter.com/KAG8xkmjFb
— Cricket.com (@weRcricket) July 11, 2025
ఈ మ్యాచ్‌లో కాంఫెర్ 12వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లోని చివరి రెండు బంతులకు విల్సన్, హ్యూమ్ లను ఔట్ చేశాడు. ఆ తరువాత 14వ ఓవర్‌లోని మొదటి మూడు బంతులకు మెక్‌బ్రిన్, మిల్లర్, జోష్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. కాంఫెర్ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 2.3 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
ఈ క్రమంలో పురుషుల ప్రొఫెషనల్ క్రికెట్‌లో 5 బంతుల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇక మహిళల క్రికెట్ విషయానికి వస్తే.. 2024లో ఈగల్స్ ఉమెన్ జట్టుపై జింబాబ్వే ప్లేయర్ కెలిస్ ఎండోవు 5 బంతుల్లో 5 వికెట్లు తీసింది.