T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు.. సంజూశాంస‌న్‌, కేఎల్ రాహుల్‌ల‌కు జ‌ట్టులో చోటు ఇవ్వ‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్‌

ఐపీఎల్ ముగిసిన వారం వ్య‌వ‌ధిలోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది.

T20 World Cup 2024 – Irfan Pathan : ఐపీఎల్ ముగిసిన వారం వ్య‌వ‌ధిలోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే జ‌ట్ల వివ‌రాల‌ను మే 1 తేదీ లోపు ఐసీసీకి స‌మ‌ర్పించాల్సి ఉంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా త‌రుపున ఎవ‌రెవ‌రు బ‌రిలోకి దిగ‌నున్నారు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి ఉంది. ఈ నెలాఖ‌రున జ‌ట్టును ప్ర‌క‌టించే అవకాశం ఉంది ఈ క్ర‌మంలో ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు త‌మ‌కు న‌చ్చిన ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టును ఎంపిక చేస్తున్నారు.

అలాగే టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా 15 మంది స‌భ్యులు గ‌ల జ‌ట్టును ఎంపిక చేశాడు. స్టార్ ఆట‌గాళ్లు సంజూ శాంస‌న్‌, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌కు త‌న జ‌ట్టులో ఇర్ఫాన్ చోటు ఇవ్వ‌లేదు. ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్‌ను ఎన్నుకున్నాడు. శుభ్‌మ‌న్ గిల్ ను రిజ్వ‌ర్ ఓపెన‌ర్‌గా ఎంపిక చేశాడు. వ‌న్‌డౌన్‌లో కోహ్లికి చోటు ఇచ్చాడు.

Ruturaj Gaikwad : రుతురాజ్ సెంచ‌రీ చేస్తే.. సీఎస్‌కే మ్యాచ్ ఓడిపోతుంది..!

మిడిల్ ఆర్డర్ విష‌యానికి వ‌స్తే.. సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే ల‌కు చోటు ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్య‌ను ఆల్‌రౌండ‌ర్‌గా ఎంపిక చేశాడు. దూబే కూడా పేస్ బౌలింగ్ చేస్తాడు. అయితే.. ఐపీఎల్ లో చెన్నై త‌రుపున ఆడుతున్న‌ప్ప‌టికీ ఒక్క‌సారి కూడా అత‌డు బౌలింగ్ చేయ‌లేదు. ఇక వికెట్ కీప‌ర్‌గా రిషబ్ పంత్‌ను తీసుకున్నాడు. సంజూ శాంస‌న్‌, కేఎల్ రాహుల్‌ల‌కు వ‌ద్ద‌నుకున్నాడు.

రవీంద్ర జడేజా జట్టులోని ఏకైక స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ కాగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ల‌ను స్పిన్న‌ర్లుగా ఎంచుకున్నాడు. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఇక పేస‌ర్ల విభాగానికి వ‌స్తే.. జ‌స్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ల‌ను ఎంపిక చేశాడు.

KL Rahul : టీ20 క్రికెట్ ఎంతో మారిపోయింది.. మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సిందే..

టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఇర్ఫాన్ పఠాన్ ఎన్నుకున్న‌ భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌.

ట్రెండింగ్ వార్తలు