Siraj : సింగ‌ర్‌తో సిరాజ్ డేటింగ్‌? ఆమె ఎవ‌రో తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

ఓ సింగ‌ర్‌తో మ‌హ్మ‌ద్ సిరాజ్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు కొన్ని ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. సిరాజ్‌తో ప్రేమ‌లో ఉన్న ఆ సింగ‌ర్ ఎవ‌రు? ఆమె బ్యాగ్రౌండ్ ఎంటంటే..?

Mohammed Siraj dating

టీమ్ఇండియా స్టార్ పేస‌ర్, హైద‌రాబాద్ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్ ప్రేమ‌లో ఉన్నాడా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. సిరాజ్ ఓ సింగ‌ర్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. ఆమె పుట్టిన రోజు పార్టీలో సిరాజ్ క‌నిపించాడు. ప్ర‌స్తుతం ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సిరాజ్ తో డేటింగ్‌లో ఉన్న మ‌హిళ ఎవ‌రు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న విష‌యాల‌ను ఇప్పుడు చూద్దాం..

జానాయి భోస్లే ఓ ఫేమ‌స్ సింగ‌ర్‌. ఆమె మ‌రెవ‌రో కాదు ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్ ఆశా భోంస్లే మ‌న‌వ‌రాలు. ఇటీవ‌ల ఆమె త‌న 23వ పుట్టిన రోజును ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ బ‌ర్త్‌డే పార్టీకి ప‌లువురు సినీ తార‌ల‌తో పాటు చాలా మంది సెల‌బ్రిటీలు హాజ‌రు అయ్యారు. ఈ పార్టీలో ఆమె మ‌హ్మ‌ద్ సిరాజ్‌తో చాలా క్లోజ్‌గా క‌నిపించింది. అత‌డితో చాలా సేపు మాట్లాడడం కెమెరా కంటికి చిక్కింది.

IND vs ENG 2nd T20 : రెండో టీ20లో ఓటమి అనంత‌రం ఇంగ్లాండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

కాగా.. పార్టీకి సంబంధించిన ఫోటోల‌ను జానాయి భోస్లే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లోనూ సిరాజ్‌, బోస్లే క్లోజ్‌గా న‌వ్వుతూ మాట్లాడ‌డం కనిపించింది. దీంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదండోయ్ వీరిద్ద‌రు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక‌రిని మ‌రొక‌రు ఫాలో చేసుకుంటున్నారు. ఇది డేటింగ్ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని ఇస్తుంది. కాగా.. ఈ పుట్టిన రోజు పార్టీలో మ‌రో టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం పాల్గొన్నాడు.

Tilak Varma : శెభాష్ తిల‌క్ వ‌ర్మ‌.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసి తెలుగోళ్ల స‌త్తా చూపావ్‌..

ముంబైలో జనవరి 16, 2002న జ‌నాయి భోస్లే జ‌న్మించింది. ఆమె పాడిన ‘సలామీ హో జాయే’, ‘బప్పా మోరియా’ వంటి పాట‌లు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమె సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌నుంది. ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ ద్వారా ఆమె అరంగ్రేటం చేయ‌నున్నారు.

Tilak Varma : రెండో టీ20 మ్యాచ్‌లో దీన్ని గ‌మ‌నించారా.. యాధృచ్చిక‌మా లేక‌.. తిల‌క్ వ‌ర్మ చెప్పే వ‌ర‌కు..

ఇదిలా ఉంటే.. మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక చేయ‌లేదు. పేస‌ర్ల విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు బుమ్రా, ష‌మీల‌కు సెల‌క్ట‌ర్లు చోటు ఇచ్చారు. సిరాజ్‌ను ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక చేయ‌క‌పోవ‌డం అంద‌రిని షాక్‌కు గురి చేసింది. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టీ20, వ‌న్డే సిరీసుల్లోనూ అత‌డికి చోటు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం త‌న‌కు దొరికిన విరామాన్ని సిరాజ్ ఎంజాయ్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కాగా.. ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం సిరాజ్ ను డీఎస్పీగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.