IND vs ENG 2nd T20 : రెండో టీ20లో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ కీలక వ్యాఖ్యలు..
రెండో టీ20లో ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు.

Jos Buttler comments after loss on 2nd T20 against india at chennai
భారత జట్టు వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ విజయం సాధించింది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కారణంగానే తాము గెలిచే మ్యాచులో ఓడిపోయినట్లుగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిన్ సాల్ట్ (4), బెన్ డకెట్ (3)లు విఫలం అయ్యారు. కెప్టెన్ జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) లు రాణించడంతో ఇంగ్లాండ్ పోరాడే స్కోరు సాధించింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, పాండ్యా, అర్ష్‌దీప్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
IND vs ENG : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను దారుణంగా ట్రోల్ చేసిన సునీల్ గవాస్కర్..
అనంతరం లక్ష్య ఛేదనలో ఓ వైపు వికెట్లు పడుతున్నా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72; 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ (26; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) చక్కని సహకారం అందించడంతో భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్, జామీ ఓవర్టన్, లియామ్ లివింగ్ స్టోన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ మాట్లాడాడు. ఓడిపోయినా కూడా చివరి వరకు పోరాడడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇదొక గొప్ప మ్యాచ్ అని అన్నాడు. తిలక్ వర్మ అసాధారణ పోరాటంతో భారత్‌కు విజయాన్ని అందించాడని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు తాము కొన్ని అవకాశాలను సృష్టించుకున్నామని, అయితే తిలక్ అసాధారణ పోరాటంతో అవన్నీ దూరం చేశాడన్నారు.
Tilak Varma : శెభాష్ తిలక్ వర్మ.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసి తెలుగోళ్ల సత్తా చూపావ్..
విజయం కోసం ఆటగాళ్లు అంతా తీవ్రంగా పోరాడారన్నాడు. ఇక తమ బ్యాటింగ్ తీరు పట్ల సంతోషం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఓడిపోయినప్పటికి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. అరంగ్రేటంలోనే జెమీ స్మిత్ అద్భుతంగా రాణించాడని , బ్రైడన్ కార్స్ బ్యాట్, బాల్‌తో రాణించి విజయ అవకాశాలను సృష్టించాడని చెప్పారు. మొత్తంగా తమ ఆటతీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోందని, వారు వికెట్లు తీస్తున్నారు. అయితే.. వారి బౌలింగ్‌లో పరుగులు సాధిస్తే తాను సంతోషిస్తానని బట్లర్ అన్నాడు.