IND vs ENG : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను దారుణంగా ట్రోల్ చేసిన సునీల్ గవాస్కర్..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

Sunil Gavaskar brutal dig at Harry Brook After Varun Chakravarthy out England Star
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో అతడిని ట్రోలింగ్ చేశాడు. తొలి టీ20 మ్యాచులో ఇంగ్లాండ్ ఓడిపోయిన తరువాత హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఓటమికి పొగమంచే కారణం అని అన్నాడు. పొగమంచు కారణంగా బంతిని అంచనా వేయలేకపోయామని, దీంతో స్పిన్నర్లను ఎదుర్కొనడం కష్టమైందని చెప్పుకొచ్చాడు. చెన్నై మ్యాచులో పొగ మంచు ఉండదని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు.
ఇక రెండో టీ20 మ్యాచులో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ (13) ఔట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి గూగ్లీకి బ్రూక్ దగ్గర సమాధానం లేకపోయింది. బ్యాట్, ప్యాడ్ గ్యాప్ మధ్యలోంచి వెళ్లిన బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్ చేసేది లేక నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. బ్రూక్ ఔట్ కాగానే కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ స్పందిస్తూ.. ఇక్కడ కాంతి చాలా స్పష్టంగా ఉంది. పొగమంచు లేదు అంటూ బ్రూక్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చాడు. కాగా.. తొలి మ్యాచులో కూడా బ్రూక్.. వరుణ్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు.
Tilak Varma : శెభాష్ తిలక్ వర్మ.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసి తెలుగోళ్ల సత్తా చూపావ్..
Through the gates! 🎯
The in-form Varun Chakaravarthy strikes in his very first over ⚡️⚡️
Follow The Match ▶️ https://t.co/6RwYIFWg7i#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/NddoPmTlDo
— BCCI (@BCCI) January 25, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45), జేమీ స్మిత్ (22), బ్రైడన్ కార్సే (31) లు రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిలక్ వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. వాసింగ్టన్ సుందర్ (26) రాణించగా సంజూ శాంసన్ (5), అభిషేక్ శర్మ (12), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (7), అక్షర్ పటేల్ (2)లు విపలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్, జామీ ఓవర్టన్, లియామ్ లివింగ్ స్టోన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జనవరి 28న జరగనుంది.