Stunning Catch : ఫారెన్ ప్లేయ‌ర్ కాదురా బాబు.. మ‌నోడే ఈ క్యాచ్ అందుకుంది.. గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో..

రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో జ‌మ్ముక‌శ్మీర్ కెప్టెన్ ప‌రాస్ డోగ్రా అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు.

Stunning Catch : ఫారెన్ ప్లేయ‌ర్ కాదురా బాబు.. మ‌నోడే ఈ క్యాచ్ అందుకుంది.. గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో..

Paras Dogra takes a Stunning Catch

Updated On : January 24, 2025 / 6:59 PM IST

క్రికెట్‌లో ఫీల్డ‌ర్లు చేసే విన్యాసాలు అద్భుర ప‌రుస్తుంటాయి. న‌మ్మ‌శ‌క్యం గానీ విధంగా ఆట‌గాళ్లు క్యాచులు అందుకుంటూ ఉంటారు. వాటిని చూస్తుంటే మ‌న క‌ళ్ల‌ని మ‌న‌మే ఒక్కొసారి న‌మ్మ‌లేం. అలాంటి ఓ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో జ‌మ్ముక‌శ్మీర్ కెప్టెన్ ప‌రాస్ డోగ్రా అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. జ‌మ్ము బౌల‌ర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 120 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ముంబై బ్యాట‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ ఒక్క‌డే రాణించాడు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జ‌మ్ము క‌శ్మీర్ 43.1 ఓవ‌ర్ల‌లో 206 ప‌రుగులు చేసింది. దీంతో జ‌మ్ముక‌శ్మీర్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన 86 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

IND vs ENG : రెండో టీ20లో ష‌మీ ఆడ‌తాడా ? ఆడ‌డా? టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచ‌న ఏంటి?

అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై మ‌రోసారి క‌ష్టాల్లో ప‌డింది. 86 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్‌ను గ‌ట్టెంకించే బాధ్య‌త‌ను కెప్టెన్ ర‌హానే భుజాన వేసుకున్నాడు. 36 బంతుల్లో 3 ఫోర్ల‌తో 16 ప‌రుగులు చేసి కుదురుకున్న‌ట్లుగా క‌నిపించాడు. అయితే.. 27వ ఓవ‌ర్‌ను ఉమ‌ర్ న‌జీర్ మీర్ వేశాడు. తొలి బంతికి ర‌హానె చ‌క్క‌టి షాట్ ఆడాడు.

అయితే.. జ‌మ్ముక‌శ్మీర్ కెప్టెన్ ప‌రాస్ డోగ్రా చ‌క్క‌టి ఫీల్డింగ్‌తో అద‌ర‌గొట్టాడు. 40 ఏళ్ల వ‌య‌సులోనూ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో న‌మ్మ‌శ‌క్యంగానీ విధంగా క్యాచ్ అందుకున్నాడు. అత‌డు ప‌ట్టుకోకుంటే బంతి ఈజీగా బౌండ‌రీల‌కి వెళ్లేది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

IND vs ENG : భార‌త్‌ను ఓడించేందుకు ఇంగ్లాండ్ మాస్ట‌ర్ ఫ్లాన్‌.. జ‌ట్టులోకి యువ పేస‌ర్‌.. రెండో టీ20కి రోజు ముందే జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. శార్దూల్ ఠాకూర్ (113) సెంచ‌రీతో రాణించ‌డంతో ముంబై కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ముంబై 7 వికెట్ల న‌ష్టానికి 274 ప‌రుగులు చేసింది. శార్దూల్ తో పాటు త‌నూష్ కోటియ‌న్ (58) క్రీజులో ఉన్నాడు. వీరిద్ద‌రు అభేద్య‌మైన ఎనిమిదో వికెట్‌కు 173 ప‌రుగులు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ప్ర‌స్తుతం ముంబై 188 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.