IND vs ENG : భార‌త్‌ను ఓడించేందుకు ఇంగ్లాండ్ మాస్ట‌ర్ ఫ్లాన్‌.. జ‌ట్టులోకి యువ పేస‌ర్‌.. రెండో టీ20కి రోజు ముందే జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..

రెండో టీ20 మ్యాచ్‌కు ఒక రోజు ముందే జ‌ట్టును ప్ర‌క‌టించింది ఇంగ్లాండ్.

IND vs ENG : భార‌త్‌ను ఓడించేందుకు ఇంగ్లాండ్ మాస్ట‌ర్ ఫ్లాన్‌.. జ‌ట్టులోకి యువ పేస‌ర్‌.. రెండో టీ20కి రోజు ముందే జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..

England replace Gus Atkinson with Brydon Carse for 2nd T20match against India

Updated On : January 24, 2025 / 4:26 PM IST

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ప్ర‌స్తుతం టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ క్ర‌మంలో శ‌నివారం చెన్నై వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టీ20 మ్యాచులో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని ఇంగ్లాండ్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో త‌న అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంది. కాగా.. రెండో టీ20 మ్యాచ్‌కు ఒక రోజు ముందే జ‌ట్టును ప్ర‌క‌టించింది. గ‌స్ అట్కిన్స‌న్ స్థానంలో బ్రైడన్ కార్సే ని తీసుకుంది. అంతేకాదండోయ్‌.. 12వ ఆట‌గాడిగా జామీ స్మిత్‌ను చేర్చిన‌ట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది.

కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గ‌స్ అట్కిన్స‌న్ విఫ‌లం అయ్యాడు. దారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. రెండు ఓవ‌ర్లు వేసి 38 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో భార‌త్ ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక బ్యాటింగ్‌లో 13 బంతులు ఆడి 2 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డి పై ఇంగ్లాండ్ వేటు వేసింది.

IND vs ENG : అదేంటి ఆర్చర్ అంతమాటనేశావ్.. ఇండియా గెలుపు అంత చులకనైపోయిందా నీకు..

కార్సే ఇంగ్లాండ్ త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు 4 టీ20 మ్యాచులు ఆడాడు. 15.33 స‌గ‌టుతో 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత‌డి ఏకాన‌మీ 7.66 గా ఉంది. కాగా.. కార్సే ఇంత వ‌ర‌కు భార‌త్‌తో ఆడ‌లేదు. రెండో టీ20 మ్యాచే అత‌డికి టీమ్ఇండియాతో తొలి మ్యాచ్ కానుంది.

తొలి టీ20 మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో 132 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ (68) ఒక్క‌డే రాణించారు. మిగిలిన వారంతా విఫ‌లం కావ‌డంతో ఓ మోస్త‌రు స్కోరుకే ఇంగ్లాండ్ ప‌రిమిత‌మైంది. భార‌త బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్‌, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ 12.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భార‌త్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ (34 బంతుల్లో 79 ప‌రుగులు) దంచికొట్ట‌గా సంజూశాంస‌న్ (26) రాణించాడు.

భారత్‌తో రెండో టీ20కి ఇంగ్లాండ్ ఇదే..
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), జోస్ బట్లర్ (కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.