Ishan Kishan : దేశ‌వాలీ క్రికెట్ ఆడాల‌ని ద్ర‌విడ్ చెప్పిన త‌రువాత‌.. ఇషాన్ కిష‌న్ రియాక్ష‌న్ ఇదే..!

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు.

Ishan Kishan

Ishan Kishan First Reaction: టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అత‌డి కెరీర్ పై క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మాన‌సిక ఒత్తిడి అంటూ ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చేశాడు. అత‌డు ప్ర‌స్తుతం సెల‌వుల్లో ఉన్నాడు. కాగా.. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నాటికి అత‌డు అందుబాటులోకి వ‌స్తాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. మాన‌సికంగా అల‌సిపోయాన‌ని చెప్పి దుబాయ్‌లో పార్టీలు ఎంజాయ్ చేస్తుండ‌డం పై బీసీసీఐ సీరియ‌స్ అయింద‌ని, ఈ క్ర‌మంలోనే అత‌డిని అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కాగా.. ఈ వార్త‌ల‌ను స్వ‌యంగా టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఖండించాడు. అలాంటిది ఏమీ లేద‌ని చెప్పాడు. దేశ‌వాలీ క్రికెట్ ఆడితేనే తిరిగి టీమ్ఇండియాలో చోటు ఉంటుంద‌ని ద్ర‌విడ్ స్పష్టం చేశాడు. దీంతో ఇషాన్ త‌ప్ప‌కుండా రంజీట్రోఫీ ఆడ‌తాడ‌ని అంతా భావించారు. తాను దేశ‌వాలీలో ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జార్ఖండ్ త‌రుపున బ‌రిలోకి దిగుతాడ‌ని అనుకున్నాను. అయితే.. ఇషాన్ రంజీలు ఆడే విష‌య‌మై త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి చ‌క్ర‌వ‌ర్తి చెప్పారు.

Shaheen Afridi : కెప్టెన్సీ అంటే అంత ఈజీ కాదు..! ష‌హీన్ పై ట్రోలింగ్‌

ఒక‌వేళ రంజీలు ఆడాల‌ని ఇషాన్ కిష‌న్ అనుకుంటే మాత్రం అత‌డిని నేరుగా తుది జ‌ట్టులోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశాడు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఇషాన్ కిష‌న్ నేరుగా స్పందించ‌లేదు. అయితే.. సోష‌ల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇషాన్ యోగా చేయ‌డంతో పాటు మైదానంలో ప‌రుగులు తీస్తూ కనిపించాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. తాను త్వ‌ర‌లోనే టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాన‌ని, అందుకోసం ప్ర‌స్తుతం సిద్ధం అవుతున్న‌ట్లు ఇషాన్ చెప్ప‌క‌నే చెప్పినట్లుగా క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. మొహాలీ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచులో ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. అఫ్గాన్‌తో టీ20 సిరీస్ త‌రువాత ఇంగ్లాండ్‌తో భార‌త జ‌ట్టు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు ఇషాన్ కిష‌న్ చోటు ద‌క్కించుకుంటాడా..? లేదా..? అన్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

ట్రెండింగ్ వార్తలు