Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు.

Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

Rohit Sharma

Rohit Sharma creates history : హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. మెన్స్ క్రికెట్‌లో అంత‌ర్జాతీయ టీ20ల్లో 100 విజ‌యాలు అందుకున్న మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. మొహాలీ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌డంతో రోహిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. కాగా.. పొట్టి క్రికెట్‌లో అత్య‌ధిక విజ‌యాలు అందుకున్న కెప్టెన్సీ రికార్డు ఇప్ప‌టికే అత‌డి పేరు మీదే ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి రోహిత్ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. దాదాపు 14 నెల‌ల త‌రువాత టీ20 జ‌ట్టులోకి వ‌చ్చిన రోహిత్ కేవ‌లం 149 మ్యాచుల్లో వంద విజ‌యాల‌ను అందుకోవ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో రోహిత్ డ‌కౌట్ అయ్యాడు.

Ishan Kishan : ద్ర‌విడ్ మాట‌ను లెక్క‌చేయ‌ని ఇషాన్ కిష‌న్‌.! ప్ర‌మాదంలో కెరీర్‌..?

ఇక ఓవ‌రాల్‌గా తీసుకుంటే.. ఇంగ్లాండ్ మ‌హిళా క్రికెట‌ర్ డ్యానీ వ్యాట్ (111) అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక విజ‌యాలు అందుకున్న కెప్టెన్‌గా నిలిచింది. ఆ త‌రువాత ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ 100 విజ‌యాల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. మెన్స్ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ 100 విజ‌యాల‌తో తొలి స్థానంలో ఉండ‌గా.. పాకిస్తాన్ సీనియ‌ర్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ 86 విజ‌యాల‌తో రెండో స్థానంలో, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ పురుషుల టీ20ల్లో అత్య‌ధిక మ్యాచులు గెలిచిన కెప్టెన్లు వీరే..

రోహిత్ శ‌ర్మ – 100* మ్యాచులు
షోయ‌బ్ మాలిక్ – 86
విరాట్ కోహ్లీ – 73
మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ – 70
మ‌హ్మ‌ద్ న‌బీ – 70

David Warner : ఏ క్రికెట‌ర్‌కు ఇలా సాధ్యం కాలేదు.. సిడ్నీ స్టేడియానికి వార్న‌ర్ ఎలా వ‌చ్చాడో తెలుసా..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 158 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని భార‌త్ 17.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబె 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 60 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి టీమ్ఇండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.