Shaheen Afridi : కెప్టెన్సీ అంటే అంత ఈజీ కాదు..! ష‌హీన్ పై ట్రోలింగ్‌

ఈ మ్యాచ్‌లో అఫ్రిది కెప్టెన్‌గానే కాకుండా ఓ బౌల‌ర్‌గానూ విఫ‌లం అయ్యాడు.

Shaheen Afridi : కెప్టెన్సీ అంటే అంత ఈజీ కాదు..! ష‌హీన్ పై ట్రోలింగ్‌

Shaheen Afridi

Shaheen Afridi : భార‌త్‌లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్తాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి బాబ‌ర్ ఆజాం త‌ప్పుకున్నాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20ల్లో ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ షాహీన్ అఫ్రిదికి సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఈ క్ర‌మంలో షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాకిస్తాన్ జ‌ట్టు న్యూజిలాండ్‌లో ప‌ర్య‌టిస్తోంది. ఆక్లాండ్ వేదిక‌గా పాక్‌, కివీస్ జ‌ట్లు మొద‌టి టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి.

ఈ మ్యాచ్‌లో అఫ్రిది కెప్టెన్‌గానే కాకుండా ఓ బౌల‌ర్‌గానూ విఫ‌లం అయ్యాడు. ఈ స్టార్ పేస‌ర్ ఒకే ఓవ‌ర్‌లో 24 ప‌రుగులు ఇచ్చాడు. కివీస్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ 6,4, 4, 4,6 బాద‌డంతో అఫ్రిది త‌న టీ20 కెరీర్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఇచ్చిన ఓవ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఇక ఈమ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో ష‌హీన్ పై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది. కెప్టెన్సీ అంటే అంత ఈజీ కాద‌ని నెటిజ‌న్లు మండిపడుతున్నారు.

Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 226 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ డారిల్ మిచెల్ (61; 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. కేన్ విలియ‌మ్ స‌న్ (57; 42 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ‌శ‌తకంతో మెరిశాడు. ఆఖ‌ర్లో చాప్‌మెన్ (26; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది లు చెరో మూడు వికెట్లు తీశారు. హారిస్ ర‌వూఫ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ 18 ఓవర్ల‌లో 180 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 46 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో బాబ‌ర్ ఆజాం (57; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో పాక్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. కివీస్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ నాలుగు వికెట్ల‌తో చెల‌రేగాడు. ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ లు చెరో రెండు వికెట్లు తీశారు. ఇష్ సోథీ ఓ వికెట్ సాధించాడు.

Ishan Kishan : ద్ర‌విడ్ మాట‌ను లెక్క‌చేయ‌ని ఇషాన్ కిష‌న్‌.! ప్ర‌మాదంలో కెరీర్‌..?

కాగా.. ఈ మ్యాచ్‌లో 406 ప‌రుగులు న‌మోదు అయ్యాయి. పాక్‌, కివీస్ త‌ల‌ప‌డిన సంద‌ర్భాల్లో టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు న‌మోదైన మ్యాచుల్లో ఇది టాప్ ప్లేస్‌లో నిలిచింది.