ధోనీ రిటైర్మెంట్‌: క్లారిటీ ఇచ్చిన భార్య సాక్షీ

  • Publish Date - September 12, 2019 / 01:07 PM IST

ఇటీవల ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఇక క్రికెట్ కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ బీజేపీ పార్టీలో చేరుతాడని నరేంద్రమోదీ టీమ్‌లో పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేస్తాడని రూమర్లు వినిపించాయి.

ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో త్వరలో ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ సీఎం అభ్యర్థిగా ధోనీని బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ధోనీ ఇవాళ(12 సెప్టెంబర్ 2019) రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు గట్టిగా ప్రచారం అయ్యాయి.

ఈ క్రమంలోనే  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా “అవన్నీ వట్టి పుకార్లే” అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ధోనీ రిటైర్మెంట్ అనేది వట్టి మాటలే అని క్లారిటీ ఇచ్చేసినట్లు అయ్యింది.

మరోవైపు సౌతాఫ్రికా జరిగే టూర్‌కు ధోనీకి చోటు లభించకపోవడంతో అందరూ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారని భావిస్తున్నారు.