Australian Open 2024 : ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచ‌ల‌నం.. నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జ‌కోవిచ్ ఔట్‌

ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది.

Jannik Sinner stuns Novak Djokovic to reach first Grand Slam final

Australian Open : ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. సెర్భియా స్టార్, ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్ట్ర్క‌మించాడు. సెమీ ఫైన‌ల్ మ్యాచులో అత‌డు యువ ఆట‌గాడి చేతిలో ఓట‌మి పాలైయ్యాడు. దీంతో అత‌డు ఇంటి ముఖం ప‌ట్టాడు.

శుక్ర‌వారం జ‌కోవిచ్, ఇట‌లీకి చెందిన జ‌నిక్ సిన‌ర్ ల మ‌ధ్య సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో జ‌నిక్ సిన‌ర్ 6-1, 6-2, 6-7 (6/8), 6-3 తేడాతో జ‌కోవిచ్ పై విజ‌యం సాధించాడు. దీంతో సిన‌ర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైన‌ల్‌కు చేరుకున్నారు. కాగా.. గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం నాలుగో ర్యాంక‌ర్ అయిన సిన‌ర్‌కు ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌ జ‌ర‌గ‌నుంది. మ‌రో సెమీఫైన‌ల్ మ్యాచులో మ‌ద్వెదెవ్‌-జెరెవ్‌లో ఎవ‌రు గెలిస్తే వారితో సిన‌ర్ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డ‌నున్నాడు.

KL Rahul : అయ్యో రాహుల్ ఎంత‌ప‌నైంది.. 50వ టెస్టులో 100 మిస్‌.. అయినా ఓ రికార్డు

సెమీఫైన‌ల్ మ్యాచులో జ‌కోవిచ్ ఆరంభం నుంచే త‌ల‌బ‌డ్డాడు. దీంతో వ‌రుస‌గా మొద‌టి రెండు సెట్ల‌ను కోల్పోయాడు. అయితే నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో సెట్‌లో అత‌డు పుంజుకున్నాడు. మూడో సెట్‌లో విజ‌యం సాధించి మ్యాచులో నిలిచాడు.

అయితే.. కీల‌క‌మైన నాలుగో సెట్‌లో మ‌రోసారి సిన‌ర్ ప‌ట్టు సాధించాడు. జ‌కో స‌ర్వీస్‌ను బ్రేక్ చేసిన సిన‌ర్ 6-3తేడాతో సెట్‌తో చేజిక్కించుకోవ‌డంతో పాటు మ్యాచ్ గెలిచి ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. మొత్తంగా జ‌కోవిచ్ ఈ మ్యాచ్‌లో నాలుగు డ‌బుల్ ఫాల్ట్స్ చేయ‌గా సిన‌ర్ ఒక‌టి మాత్ర‌మే చేయ‌డం గ‌మ‌నార్హం.

Shoaib Malik : షోయ‌బ్ మాలిక్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. కాంట్రాక్ట్ ర‌ద్దు..!