Japan Open : జపాన్ ఓపెన్‌లో భార‌త్‌కు నిరాశ‌.. సింగిల్స్‌లో ల‌క్ష్య‌సేన్‌, డ‌బుల్స్‌లో సాత్విక్- చిరాగ్ జోడీ ఓటమి..

జపాన్ ఓపెన్‌లో భార‌త బ్యాడ్మింట‌న్ ఆట‌గాళ్ల‌కు క‌లిసిరావ‌డం లేదు

Japan Open Lakshya Sen and Satwik-Chirag knocked out of Japan Open in second round

జపాన్ ఓపెన్‌లో భార‌త బ్యాడ్మింట‌న్ ఆట‌గాళ్ల‌కు క‌లిసిరావ‌డం లేదు. టోక్యో వేదిక‌గా గురువారం జ‌రిగిన సూప‌ర్ 750 బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌లో భార‌త స్టార్ ల‌క్ష్య సేన్‌, డ‌బుల్స్ ద్వ‌యం సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి రెండో రౌండ్‌లో ఓడిపోయింది.

పురుషుల సింగ్స్‌లో రెండో రౌండ్‌లో ప్ర‌పంచ 18వ ర్యాంకర్ అయిన ల‌క్ష్య సేన్ ఓడిపోయాడు. 19-21, 11-21 తేడాతో జపాన్‌కు చెందిన కోడై నరోకా చేతితో ఓట‌మిని చ‌విచూశాడు. ఇదే టోర్నీలో తొలి రౌండ్‌లో చైనాకు చెందిన వాంగ్ జెంగ్ జింగ్‌పై 21-11, 21-18 తేడాతో విజయం సాధించినా ఆ జోరును కొనసాగించడంలో ల‌క్ష్య సేన్ విఫలమయ్యాడు. దీంతో అత‌డు జ‌పాన్ సూప‌ర్ 750 టోర్నీ నుంచి నిష్ర్క‌మించారు.

ENG vs IND : బుమ్రా ఆడితే టీమ్ఇండియా ఓడిపోయింది.. నాలుగో టెస్టు ముందు మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఇక డ‌బుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 22-24, 14-21 తేడాతో ఐదో సీడ్ చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్- వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయింది. దాదాపు 44 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. ఈ గెలుపుతో పారిస్ ఒలింపిక్స్ ర‌జ‌త ప‌త‌క విజేత‌లు వీ కెంగ్- వాంగ్ చాంగ్ జోడీ భార‌త జ‌ట్టు పై త‌మ ఆధిక్యాన్ని 7-2కి పెంచుకుంది.