చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా.. హర్భజన్ సింగ్‌, జడేజా రికార్డు బద్దలు

ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గానూ బుమ్రా నిలిచాడు. ఆర్‌సీబీపై అతడు 29 వికెట్లు పడగొట్టాడు.

Jasprit Bumrah రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం వాంఖడే స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. 5 కీలక వికెట్లు పడగొట్టి ముంబై ఇండియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్‌తో పాటు మహిపాల్ లోమ్రోర్, సౌరవ్ చౌహాన్ మరియు విజయ్‌కుమార్ వైషాక్‌ లను అవుట్ చేశాడు.

5.20 ఎకానమీ రేటుతో నాలుగు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 5/21తో బుమ్రా ఇన్నింగ్స్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీపై తొలిసారిగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డుకెక్కాడు. ఐపీఎల్‌లో రెండోసారి 5 వికెట్ల ఘనత సాధించాడు బుమ్రా. జేమ్స్ ఫాల్క్‌నర్, జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్‌ ఇంతముందు ఈ ఫీట్ సాధించారు.

ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గానూ బుమ్రా నిలిచాడు. ఆర్‌సీబీపై అతడు 29 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు రవీంద్ర జడేజా, సందీప్ శర్మ పేరిట ఉండేది. వీరిద్దరూ ఆర్‌సీబీపై 26 వికెట్లు తీశారు.

ఐపీఎల్‌ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్ల లిస్టులో హర్భజన్ సింగ్‌ను బుమ్రా అధిగమించాడు. హర్భజన్ 163 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకోగా.. 125 మ్యాచ్‌లలోనే బుమ్రా ఈ ఘనత సాధించాడు. 18.46 స్ట్రైక్ రేట్‌తో 22.56 సగటుతో 155 వికెట్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/10. ఇక మ్యాచ్ విషయానికొస్తే 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని ముంబై చిత్తు చేసింది.

Also Read: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ బుమ్రా గురించి హార్దిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు