Jasprit Bumrah dominates Virat Kohli in nets
Virat Kohli : గత కొంతకాలంగా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచుల్లో అతడు విఫలం అయ్యాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచులోనూ అతడు రాణించకలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో కాన్ఫూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచులో ఫామ్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
బుధవారం గంటల కొద్ది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. తన బలహీనతగా మారిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేశాడు. ఇక నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడట. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం బుమ్రా 15 బంతులను వేయగా నాలుగు సార్లు కోహ్లీ ఔట్ అయినట్లు సమాచారం.
జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లోనూ ప్రాక్టీస్ చేశాడట. జడేజా బౌలింగ్‌లో బాల్ మిస్ కావడంతో కోహ్లీ కాస్త ఆందోళనకు గురైయ్యాడు. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనూ ఇబ్బంది పడినట్లు తెలిపింది. అయితే.. కొన్ని చక్కని షాట్లను కోహ్లీ ఆడినట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే.. తొలి టెస్టు మ్యాచ్ గెలిచి ఊపుమీదున్న భారత్ అదే జోష్‌లో కాన్ఫూర్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. బంగ్లా పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న 6 రికార్డులు.. ఏంటో తెలుసా?