IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న 6 రికార్డులు.. ఏంటో తెలుసా?
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

Ashwin Can Break 6 Records In Kanpur Test
IND vs BAN 2nd Test : టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో బ్యాటు, బాల్‌తో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (113)తో రాణించాడు. ఆ పై రెండో ఇన్నింగ్స్‌లో బంతితో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఆటగాళ్ల జాబితాలో షేన్ వార్న్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
కాన్ఫూర్ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో అశ్విన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డులు ఏంటో చూద్దాం..
నాలుగో ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు..
భారత ఆటగాళ్లలో ఇప్పటికే టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ కొనసాగుతున్నాడు. ఇంకొక్క వికెట్ గనుక నాలుగో ఇన్నింగ్స్‌లో అశ్విన్ తీస్తే.. చివరి ఇన్నింగ్స్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు.. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా నిలవనున్నాడు.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్..
భారత్ vs బంగ్లాదేశ్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా..
మరో మూడు వికెట్లు తీస్తే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. జహీర్ మొత్తం 31 వికెట్లు తీశాడు.
డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా..
మరో నాలుగు వికెట్లు తీస్తే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు జోష్ హేజిల్‌వుడ్ (51) పేరిట ఉంది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన..
టెస్టు క్రికెట్‌లో అశ్విన్ ఇప్పటి వరకు 37 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్‌వార్న్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. కాన్ఫూర్ టెస్టులో అశ్విన్ 5 వికెట్ల ప్రదర్శన చేస్తే షేన్ వార్న్ మూడో స్థానానికి పడిపోతాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు..
మరో ఎనిమిది వికెట్లు తీస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయాన్ పేరిట ఉంది. లైయాన్ 187 వికెట్లు తీయగా అశ్విన్ 180 వికెట్లు పడగొట్టాడు.
ICC rankings : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో విఫలం.. పడిపోయిన రోహిత్, కోహ్లీ ర్యాంకులు..
టెస్టు క్రికెట్ చరిత్రలో ఏడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా..
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ (522) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. మరో తొమ్మిది వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ లైయాన్ (530) ను అధిగమించి ఏడో స్థానానికి చేరుకుంటాడు.