IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

కాన్పూర్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 27 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

IND vs BAN 2nd test Rain prediction

Updated On : September 25, 2024 / 5:39 PM IST

IND vs BAN 2nd test : రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. చెన్నైలోని చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో ఏకంగా 280 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఇదే జోష్‌లో రెండు టెస్టు మ్యాచులోనూ విజేత‌గా నిలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ భావిస్తోంది. మ‌రోవైపు పాక్ పై చారిత్ర‌క సిరీస్ విజ‌యం సాధించి భార‌త్‌తో తొలి టెస్టులో బోల్తా ప‌డ్డ బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచులో ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

కాన్పూర్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 27 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందే టీమ్ఇండియా అభిమానుల‌కు ఓ బ్యాడ్ న్యూస్‌ను చెప్పింది వాతావ‌ర‌ణ శాఖ. మ్యాచ్ మొద‌టి మూడు రోజులు వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

Harmanpreet Kaur : ఏ జ‌ట్టునైనా ఓడిస్తాం.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తోనే వ‌స్తాం : హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌

మ్యాచ్ ఆరంభం కానున్న మొద‌టి రోజు శుక్ర‌వారం 93 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పింది. ఇక రెండో రోజు శ‌నివారం 83 శాతం, మూడో రోజు ఆదివారం 59 శాతం వ‌ర్షం కురిసే ఛాన్స్‌లు ఉన్న‌ట్లు పేర్కొంది. ఇక నాలుగో రోజు, ఐదో రోజు మాత్రం వ‌ర్షం పడ‌ద‌ని తెలిపింది.

మొద‌టి మూడు రోజులు వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ పూర్తిగా జ‌ర‌గ‌క‌పోయినా ఆఖ‌రి రెండు రోజులు పూర్తిగా జ‌రిగితే మాత్రం ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. భారీ వ‌ర్షం కురిసి మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారితే మాత్రం ఆట‌కు ఆటంకం క‌ల‌గ‌డం ఖాయం. దీంతో మ్యాచును ఎంజామ్ చేద్దామ‌న్న అభిమానుల‌ను వ‌రుణుడు క‌ల‌వ‌ర‌పెడుతున్నాడు.

ICC rankings : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో విఫ‌లం.. ప‌డిపోయిన రోహిత్, కోహ్లీ ర్యాంకులు..

ఈ మ్యాచ్ ర‌ద్దైనా, డ్రా అయినా గానీ సిరీస్ భారత్ కైవ‌సం అవుతుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ 2025 నేప‌థ్యంలో ప్ర‌తి మ్యాచ్ ఎంతో కీల‌కం. ఈ మ్యాచ్ జ‌రిగి గెలిస్తే మాత్రం ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉన్న భార‌త్ త‌న స్థానాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంటుంది.