ICC rankings : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో విఫలం.. పడిపోయిన రోహిత్, కోహ్లీ ర్యాంకులు..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది.

Rohit and Kohli drop in ICC Test Rankings after batting debacle in Chennai Test
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో రాణించిన భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్‌లతో పాటు సీనియర్ ఆటగాడు అశ్విన్‌లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో విఫలం అయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు తమ స్థానాల నుంచి కిందకు పడిపోయారు.
తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని ఐదో స్థానానికి చేరుకున్నాడు. అటు రోహిత్ శర్మ, ఇటు కోహ్లీలు చెరో ఐదు స్థానాలు దిగజారి వరుసగా 10వ, 12వ స్థానానికి పడిపోయారు.అటు శతకాలతో రాణించిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ లు వరుసగా 6, 14వ స్థానంలో నిలిచారు. సెంచరీ చేసిన అశ్విన్ 72వ స్థానానికి చేరుకున్నాడు.
ఇక ఈ జాబితాలో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఉన్నాడు. ఆ తరువాత వరుసగా డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్‌లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్..
జోరూట్ (ఇంగ్లాండ్) – 899 రేటింగ్ పాయింట్లు
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 852 రేటింగ్ పాయింట్లు
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 760 రేటింగ్ పాయింట్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 757 రేటింగ్ పాయింట్లు
యశస్వి జైస్వాల్ (భారత్) – 751 రేటింగ్ పాయింట్లు
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన ప్రభాస్ జయసూర్య టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్, బుమ్రా మొదటి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రాలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Nicholas Pooran : వామ్మో పూరన్ అసలు ఆగడం లేదుగా.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్..
రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 871 రేటింగ్ పాయింట్లు
జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 854 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) -847 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 820 రేటింగ్ పాయింట్లు
కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) -820 రేటింగ్ పాయింట్లు