IPL 2025 : స్టార్ ఆట‌గాళ్ల‌కు షాకిచ్చేందుకు సిద్ధ‌మైన ఫ్రాంచైజీలు..! లిస్ట్‌లో రోహిత్‌తో పాటు ఇంకెవ‌రు ఉన్నారంటే?

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

IPL 2025 : స్టార్ ఆట‌గాళ్ల‌కు షాకిచ్చేందుకు సిద్ధ‌మైన ఫ్రాంచైజీలు..! లిస్ట్‌లో రోహిత్‌తో పాటు ఇంకెవ‌రు ఉన్నారంటే?

Rohit Sharma To Be Released By MI 4 Other Shocks That Can Be Expected

Updated On : September 24, 2024 / 3:14 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబ‌ర్‌లో వేలం జ‌ర‌గ‌నుంది. ఆట‌గాళ్ల రిటెన్ష‌న్‌, రైటు టు మ్యాచ్ నిబంధ‌న‌ల గురించి బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించలేదు. అయిన‌ప్ప‌టికి కూడా ప్రాంఛైజీలు దాదాపుగా తాము అట్టిపెట్టుకోవాల్సిన ఆట‌గాళ్ల‌పై ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో స్టార్ ఆట‌గాళ్లు అయిన ఓ ఐదుగురిని ఆయా ఫ్రాంచైజీలు వ‌దిలి పెట్ట‌నున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ ఆట‌గాళ్లు ఎవ‌రో ఓ సారి చూద్దాం..

రోహిత్ శర్మ : ముంబై ఇండియ‌న్స్‌ను ఐదుసార్లు విజేత‌గా నిలిపాడు రోహిత్ శ‌ర్మ‌. అయితే.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు అత‌డిని కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. అత‌డి స్థానంలో ముంబై నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను హార్దిక్ కు అప్ప‌గించారు. దీంతో రోహిత్ శ‌ర్మ జ‌ట్టును వీడ‌నున్నాడు అనే వార్త గ‌త‌కొన్నాళ్లుగా వ‌స్తున్నాయి. అయితే.. తాజాగా ఓ వార్త వైర‌ల్‌గా మారింది. ముంబై ఫ్రాంచైజీనే రోహిత్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌.

Sarfaraz Khan : పాపం స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. మ‌రోసారి నిరాశ త‌ప్ప‌దా?

కేఎల్ రాహుల్ : ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో ఓ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చిత్తుగా ఓడిపోయింది. మైదానంలోనే ఆ జ‌ట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్‌తో ల‌క్నో య‌జమాని సంజీవ్ గోయెంకా వాగ్వాదం చేస్తున్న‌ట్లుగా ఉన్న వీడియోలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సీజ‌న్‌లో అటు బ్యాట‌ర్‌గా ఇటు కెప్టెన్‌గా రాహుల్ విఫ‌లం అయ్యాడు. దీంతో ల‌క్నో కొత్త సార‌థిని కోరుకుంటుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే రాహుల్‌ను వ‌దిలివేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

వెంకటేష్ అయ్యర్ : ఐపీఎల్ 2024 సీజ‌న్ విజేత‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నిలిచింది. జ‌ట్టును విజేత‌గా నిల‌వ‌డంలో ఆల్‌రౌండ‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ కీల‌క పాత్ర పోషించాడు. అయితే.. ఆ జ‌ట్టులో స్టార్ ఆట‌గాళ్లు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, శ్రేయాస్ అయ్యర్, ఫిల్ సాల్ట్ లు ఫ్రాంచైజీకి ప్రాధాన్య ఎంపికలు కావచ్చు. దీంతో వేలానికి వెంక‌టేశ్ అయ్య‌ర్ ను విడిచిపెట్ట‌వ‌చ్చు. వేలంలో అత‌డిని తిరిగి ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది.

Nicholas Pooran : వామ్మో పూర‌న్ అస‌లు ఆగ‌డం లేదుగా.. టీ20ల్లో ప్ర‌పంచ రికార్డు

ఫాఫ్ డుప్లెసిస్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గత సీజన్‌లో కెప్టెన్‌గా, ఆట‌గాడిగా రాణించ‌లేక‌పోయాడు. ప్ర‌స్తుతం అత‌డి వ‌య‌సు 40 ఏళ్లు. దీంతో అత‌డిని త‌ప్పించి యువ ఆట‌గాడికి సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని ఆర్‌సీబీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

గ్లెన్ మాక్స్‌వెల్ : రూ.14.25 కోట్ల‌ను వెచ్చించి మ‌రీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు గ్లెన్‌మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది. అయితే.. అత‌డు ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో ఘోరంగా విఫ‌లం అయ్యాడు. ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌లేదు. ఇక బౌలింగ్‌లోనూ ఏ మాత్రం ప్రభావం చూప‌లేక‌పోయాడు. దీంతో అత‌డిని వ‌దిలివేయాల‌ని ఆర్‌సీబీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.