Sarfaraz Khan : పాపం సర్ఫరాజ్ ఖాన్.. మరోసారి నిరాశ తప్పదా?
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్.

Sarfaraz Khans wait continues likely to be released from Indian team for Irani Cup
Sarfaraz Khan : ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. సీనియర్ల గైర్హజరీలో అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. అయితే.. సీనియర్ ఆటగాళ్లు తిరిగి రావడంతో తుది జట్టులో అతడికి ఆడే అవకాశం రావడం లేదని చెప్పొచ్చు.
రెండో టెస్టు స్క్వాడ్ నుంచి అతడిని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 27 (శుక్రవారం ) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. అదే సమయంలో అక్టోబర్ 1 నుంచి ఇరానీ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌ను రెండో టెస్టు స్క్వాడ్ నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టుకు ముందు దులీప్ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచుల కోసం అతడిని తుది జట్టుకు పరిగణలోకి తీసుకోని సంగతి తెలిసిందే.
భారత జట్టులోని ప్రధాన బ్యాటర్లలో ఎవరికైనా ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే తప్ప సర్ఫరాజ్ ఖాన్ రెండో టెస్టులో ఆడే అవకాశం ఉండదు. అలా కానీ పక్షంలో అతడిని ప్రధాన స్క్వాడ్ నుంచి రిలీజ్ చేస్తారు. రెండో టెస్టు ప్రారంభమైన తరువాత సర్ఫరాజ్ కాన్పూర్ నుంచి లక్నో వెళ్లనున్నాడు.
ఇరానీ కప్‌లో సర్ఫరాజ్ ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. పృథ్వీ షాతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్1న ముంబై జట్టు రెస్టాఫ్ ఇండియా లక్నో వేదికగా ముంబైతో తలపడనుంది.
Nicholas Pooran : వామ్మో పూరన్ అసలు ఆగడం లేదుగా.. టీ20ల్లో ప్రపంచ రికార్డు