Ashwin : చెపాక్ పిచ్ గురించి క్యూరేటర్ ముందే చెప్పాడు.. అతడు చెప్పినట్లే.. అశ్విన్ కామెంట్స్ వైరల్
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

The first day there will be bounce curator said to ashwin
Ravichandran Ashwin : చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేయడంతో పాటు ఇటు బౌలింగ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు.
రాహుల్ ద్రవిడ్ తరువాత కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న తేడాను అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు. ఈ ఇద్దరూ గొప్ప కోచ్‌లని కొనియాడాడు. అయితే.. గౌతమ్ గంభీర్ చాలా రిలాక్స్‌గా ఉంటాడని చెప్పాడు. అందుకనే అతడిని తాను రిలాక్స్‌డ్ రాంకో అని పిలుస్తానని చెప్పుకొచ్చాడు. టీమ్ సమావేశంలోనూ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా.. చాలా కూల్‌గా రండి అని పిలుస్తాడన్నారు.
Nicholas Pooran : వామ్మో పూరన్ అసలు ఆగడం లేదుగా.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
ద్రవిడ్ విషయానికి వస్తే.. అతడు మాత్రం అన్నీ సక్రమంగా ఉండాలని అనేవాడు. ఏదీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని చెప్పేశాడు. వస్తువులన్నీ సక్రమంగా ఉండాలనేవాడు. కానీ గంభీర్ అలా కాదు. ప్రశాంతంగా ఉంటాడు. ఖచ్చితంగా అతడు కుర్రాళ్లతో పాటు ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటాడనే నమ్మకం ఉన్నట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఇక తొలి టెస్టు చెపాక్ పిచ్ గురించి మాట్లాడుతూ.. తాను ఆడిన అత్యుత్తమ పిచ్ ఇదేనని అన్నాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టు కూడా ఇదే పిచ్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్ క్యూరేటర్ తనతో మాట్లాడాడని తెలిపాడు. తొలి రోజు ఉదయం బౌన్స్ ఉండి ప్లేసర్లకు అనుకూలం అని చెప్పాడు. ఆ తరువాత బ్యాటింగ్‌కు సహకరిస్తుందన్నాడు. అనంతరం స్పిన్ తిరుగుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లే తొలి రోజు బౌన్స్ ఉందని అశ్విన్ చెప్పాడు.
Najmul Hossain : భారత్ పై ఓటమి.. బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్.. మేం ఓడిపోయినా..