Najmul Hossain : భారత్ పై ఓటమి.. బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్.. మేం ఓడిపోయినా..
చెపాక్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర ఓటమిని చవి చూసింది.

Najmul Hossain shanto Comments after lost against india in first test
Najmul Hossain shanto Comments : చెపాక్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ జట్టు కొంపముంచిందన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. మ్యాచ్ ఓడిపోయినా తమకు కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయన్నాడు.
మ్యాచ్ ఆరంభమైన మొదటి రెండు, మూడు గంటల పాటు హసన్ మహమూద్, టస్కిన్ అహ్మద్, నహిద్ రాణాలు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఈ మ్యాచ్‌లో ఇదే తమకు సానుకూల అంశం అని చెప్పాడు. అయితే.. భారత్ అద్భుతంగా ఆడిందని తెలిపాడు. టాప్, మిడిల్ ఆర్డర్ విఫలం అయినా కూడా లోయర్ ఆర్డర్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిందన్నారు. కొత్త బంతితో బంగ్లా బౌలర్లు అత్యుత్తమ ప్రద్శన ఇచ్చారన్నాడు.
గత కొన్ని సిరీసులుగా బౌలింగ్‌లో తమ ప్రదర్శన మెరుగైందన్నాడు. ఇదే నిలకడను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నాడు. ఓ బ్యాటర్‌గా తాను పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. ఫలితం గురించి ఆలోచించకుండా వీలైనంత వరకు పోరాడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. తదుపరి మ్యాచులో బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా సత్తా చాటుతారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. ఆ తరువాత బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు కీలకమైన 277 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల లక్ష్యం నిలవగా 234 పరుగులకే బంగ్లా కుప్పకూలింది.
Team India : టీమ్ఇండియా సరికొత్త చరిత్ర.. 92 ఏళ్లు.. 580 మ్యాచ్‌లు.. 36 మంది కెప్టెన్లు..