IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్‌ల‌కు మొండిచేయి..

చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్‌ల‌కు మొండిచేయి..

India retain same squad for 2nd Test against Bangladesh

Updated On : September 22, 2024 / 12:51 PM IST

IND vs BAN : చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ సెప్టెంబ‌ర్ 27 నుంచి కాన్పూర్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు బీసీసీఐ తొలుత తొలి టెస్టుకు మాత్ర‌మే జ‌ట్టును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో తొలి టెస్టు ముగిసిన త‌రువాత జ‌ట్టులో మార్పులు ఉండ‌వ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రిగింది.

Team India : టీమ్ఇండియా స‌రికొత్త చ‌రిత్ర.. 92 ఏళ్లు.. 580 మ్యాచ్‌లు.. 36 మంది కెప్టెన్లు..

కాగా.. తొలి టెస్టు ముగిసిన కాసేప‌టికే బీసీసీఐ రెండో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించింది. తొలి టెస్టుకు ప్ర‌క‌టించిన జ‌ట్టునే రెండో టెస్టుకు కొన‌సాగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, ర‌వీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మ‌హ‌మ్మ‌ద్‌ సిరాజ్, ఆకాష్ దీప్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

IND vs BAN : అశ్విన్ మాయాజాలం.. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం