IND vs BAN : అశ్విన్ మాయాజాలం.. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం
రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో టీమ్ఇండియా ఘనంగా బోణీ కొట్టింది.

India won by 280 runs against Bangladesh in chepauk test
రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో టీమ్ఇండియా ఘనంగా బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 250 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీమ్ఇండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్ల తేడాతో చెలరేగడంతో 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(82) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న ఆరంభం కానుంది.
IPL 2025 : బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఇదేనా? 4+2!
టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113) శతకంతో పాటు రవీంద్ర జడేజా(86) లు హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 227 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (109), శుభ్‌మన్ గిల్ (119) శతకాలతో చెలరేగారు. 287-4 స్కోరు వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాముందు భారీ లక్ష్యం నిలిచింది. అశ్విన్ ధాటికి బంగ్లాదేశ్ చతికిల పడింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
IND vs BAN : పూజల ఫలితం దక్కిందోచ్..! బ్యాట్, హెల్మెంట్‌కు పంత్ పూజలు.. ఎందుకో తెలుసా?
Jadeja wraps things up in style! 😎
It’s all over in Chennai 🙌#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/1ChxakWLfL
— BCCI (@BCCI) September 22, 2024